2023 సంక్రాంతికి సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో సాలిడ్ బోణీ కొట్టారు.. కట్ చేస్తే ప్రభాస్ ‘ఆదిపురుష్’ వచ్చే వరకు బాక్సాఫీస్ వద్ద అంతటి హంగామా కనిపించలేదు
2023 సంక్రాంతికి సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నటసింహ నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో సాలిడ్ బోణీ కొట్టారు.. కట్ చేస్తే ప్రభాస్ ‘ఆదిపురుష్’ వచ్చే వరకు బాక్సాఫీస్ వద్ద అంతటి హంగామా కనిపించలేదు.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ గట్టి పోటీ ఇస్తున్నా కానీ ప్రతీ శుక్రవారం కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి.. వాటిలో దాదాపు చాలా వరకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయినవే.. కొన్ని అయితే అసలు విడుదలైన సంగతి కూడా తెలియదు.. ఇక ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ప్రపంచ సినీ ప్రియులను అలరించడానికి ‘ఇండియానా జోన్స్’, ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి క్రేజీ హాలీవుడ్ మూవీస్, ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న నిఖిల్ ‘స్పై’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాలు మీద భారీ అంచనాలున్నాయి..
వీక్లీ ఓటీటీల్లో కొత్త సినిమాలొస్తున్నా.. కచ్చితంగా థియేటర్‌లోనే చూడాల్సిన సినిమాలు కూడా ఉంటాయి.. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు సింగిల్ స్క్రీన్‌లో చూస్తే ఆ సందడి వేరేగా ఉంటుంది.. ‘హోమ్ థియేటర్, మల్టీప్లెక్స్’ ఎక్స్‌పీరియన్స్ గురించి ‘సరైనోడు’ మూవీలో బ్రహ్మానందం చెప్పినట్టు.. ప్రేక్షకుల మధ్య హాల్లో కూర్చుని చూస్తే వచ్చే మజానే వేరు.. ఈ జూన్ నెలాఖరు నుంచి జూలై నెలాఖరు వరకు నెల రోజుల పాటు టాలీవుడ్, హాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఇండస్ట్రీల నుండి ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కొన్ని ఫిలింస్ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి.. ఇప్పటికే తమ సినిమాలకు సంబంధించిన ప్రోమోస్, ప్రమోషన్లతో జనాల్లో అంచనాలు పెంచేసిన మేకర్స్ ప్రతి వారం ప్రేక్షకాభిమానులను అలరించడాని పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు..
స్పై – జూన్ 29
సామజవరగమన – జూన్ 29
ఇండియానా జోన్స్ 5 – జూన్ 29
రంగబలి – జూలై 7
మిషన్: ఇంపాజిబుల్ – (Dead Reckoning Part One) – జూలై 12
బేబి ది మూవీ – జూలై 14
ఊరు పేరు భైరవకోన – జూలై 21
ఓపెన్ హైమర్ – జూలై 21
బార్బి – జూలై 21
బ్రో ది అవతార్ – జూలై 28
మార్క్ ఆంటోని – జూలై 28