తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మరికొన్ని భాషల్లో ఈ ఒక్క రోజే దాదాపు 20 చిత్రాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌ల వివరాలు.
ప్రతి శుక్రవారం థియేటర్లలో విడుదల కాబోయే కొత్త సినిమాలతో పాటు ఆ వారంలో మరీ ముఖ్యంగా వీకెండ్‌లో ఏ మూవీస్, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయబ్బా అంటూ మూవీ లవర్స్ నెట్టింట తెగ సెర్చ్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్టులతో కూడిన ఒరిజినల్స్, సిరీస్‌లతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నాయి ఓటీటీ మాధ్యమాలు. గతవారం ‘ది కేరళ స్టోరీ’, ‘కేరళ క్రైమ్ ఫైల్స్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘టీకూ వెడ్స్ షేరు’, ‘మళ్లీ పెళ్లి’, ‘ఇంటింటి రామాయణం’ తో పాటు తమన్నా రెచ్చిపోయి రచ్చ చేసిన ‘జీ ఖర్దా’ సిరీస్ కూడా ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ గురు, శుక్ర వారాల్లో అంటే జూన్ 29, 30వ తేదీల్లో హాలీవుడ్ టు టాలీవుడ్ క్రేజీ మూవీస్ అండ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ వివరాలుయ ఇలా ఉన్నాయి..
ఈ వారం విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌ల లిస్ట్..
అమెజాన్ ప్రైమ్
జాక్ ర్యాన్ 4 – ఇంగ్లీష్ సిరీస్
వీరన్ (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం)
ఫాస్ట్ ఎక్స్ – హాలీవుడ్ (స్ట్రీమింగ్ అవుతుంది)
ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్ – హిందీ సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది)
సబ్తూబెర్సామా బపక్ – ఇండోనేషియన్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)
నెట్‌ఫ్లిక్స్
అఫ్వా – హిందీ మూవీ
సెలబ్రిటీ – కొరియన్ సిరీస్
ఈజ్ ఇట్ టేక్ 2 – ఇంగ్లీష్ సిరీస్
లస్ట్ స్టోరీస్ 2 – హిందీ సిరీస్- (స్ట్రీమింగ్ అవుతుంది)
సీయూ ఇన్ మై నైన్టీన్త్ లైఫ్ – కొరియన్ సిరీస్ – (స్ట్రీమింగ్ అవుతుంది)
ది విచ్చర్ సీజన్ 3 – తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)
ది ఇన్నర్ ఛాంబర్స్ – జపనీస్ ఫిలిం (స్ట్రీమింగ్ అవుతుంది)
డిస్నీ+హాట్‌స్టార్
ది నైట్ మేనేజర్ 2 (హిందీ సిరీస్)
గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్ (ఇంగ్లీష్ సిరీస్)
జీ5
లకడ్ బగ్గా (హిందీ సినిమా)
విమానం (తెలుగు సినిమా)
ఆహా
అర్థమైందా అరుణ్ కుమార్ (సిరీస్)
నిన్ను చేరే తరుణం – తెలుగు మూవీ
జియో సినిమా
సార్జెంట్ – హిందీ సిరీస్
అడ్డా టైమ్స్
మిస్ కాల్ – బెంగాలీ సినిమా