ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన మూవీ ఏదైనా ఉందంటే అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ 'బలగం'. ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ తాజాగా ఫిక్సయింది. అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఈ మధ్య కాలంలో హిట్ టాక్ తో కావొచ్చు, వివాదాలతో కావొచ్చు వార్తల్లో నిలిచిన మూవీ ‘బలగం’. తెలంగాణ పల్లె సంస్కృతి అద్దం పట్టేలా ఈ సినిమాను తీశారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. మరీ ముఖ్యంగా పలు సినిమాల్లో కమెడియన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుని ‘జబర్దస్త్’ షోతో మరింత ఫేమ్ తెచ్చుకున్న వేణు.. ఈ మూవీతో తొలిసారి డైరెక్టర్ గా మారాడు. తనలోని ఎవరికి తెలియని టాలెంట్ ని అందరికీ పరిచయం చేసి ఔరా అనిపించాడు. అలా ఫస్ట్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ తేదీ ఫిక్స్ అయింది. అందుకు సంబంధించిన డీటైల్స్ కూడా వచ్చేశాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. థియేటర్లలో ఒకప్పుడు సినిమా రిలీజైతే ఎలా ఉంది? ఎప్పుడు వెళ్దాం? అని మాట్లాడుకునేవారు. ఇప్పుడు అందులో నటీనటులు, టాక్ బట్టి.. థియేటర్లలో చూడాలా, ఓటీటీలో చూడాలా అని డిసైడ్ అవుతున్నారు. కుదిరిన వాళ్లు బిగ్ స్క్రీన్ పై చూస్తున్నారు. మిగిలిన వాళ్లు మొబైల్లోకి వచ్చాక లుక్ వేసేస్తున్నారు. అలా సంక్రాంతికి విడుదలైన చిత్రాలన్నీ ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పుడు అందరికీ ‘బలగం’ కాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. రీసెంట్ గా థియేటర్లలో 20 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ పెట్టారు.
ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా నటించిన ‘బలగం’ మూవీ ఓటీటీ రైట్స్ ని మన దేశంలో అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ప్రపంచంలో మిగతా అన్ని దేశాల్లో హక్కుల్ని మాత్రం సింప్లీ సౌత్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు వాళ్లు అధికారికంగా ట్వీట్ చేస్తూ.. మార్చి 24 నుంచి ఓటీటీలో తీసుకొస్తున్నామని ప్రకటించారు. మన దేశంలో మాత్రం ఏప్రిల్ తొలివారంలో ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మరి ‘బలగం’ ఓటీటీ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిటింగ్? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
When debts and dowry become a priority, family ties start to loosen. But can the sudden demise of a loved one bring them back together?
One of the bests of Telugu cinema in 2023, #Balagam, streaming on Simply South from March 24 worldwide, excluding India. pic.twitter.com/DuSTeaevMN
— Simply South (@SimplySouthApp) March 23, 2023