తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య చిన్న సినిమాల హవా బాగా పెరిగిపోయాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాలు ప్రతి సంవత్సరం మూడు నాలుగు వస్తే.. చిన్న సినిమాలు పదుల సంఖ్యల్లో వస్తున్నాయి. కంటెంట్ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా బ్లాక్ బస్టర్ చేస్తారు ఆడియన్స్. జబర్ధస్త్ నటుడు వేణు దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష కోసం పకడ్బందీ అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇటీవల జరిగిన పేపర్ లీకేజ్ ఘటనలు దృష్టిలో ఉంచుకొని అలాంటి వాటికి అవకాశం లేకుండా గట్టి చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది బయోమెట్రిక్ ఉండగా.. ఈసారి థంబ్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. తాజాగా గ్రూప్-4 పరీక్ష
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ యాసకు ఎంత ప్రాముఖ్యత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల టాలీవుడ్ మూవీస్ లో తెలంగాణ యాస పెడితే చాలు సినిమా సూపర్ హిట్టు అవుతుంది. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న వేణు తర్వాత వెండితెరపై కమెడియన్ గా సత్తా చాటాడు. ఎవరూ ఊహించని విధంగా దర్శకుడిగా మారి ‘బలగం’ మూవీ తెరకెక్కించాడు. ఈ చిత్రం ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. థియేటర్లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది బలగం మూవీ. ఇక బలగం సినిమాపై కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌ల్లో తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. తాజాగా గ్రూప్-4 పరీక్షలో బలగం సినిమాపై ఒక ప్రశ్న అడిగారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్ – 4 పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ‘మార్చి 2023 లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో బలగం మూవీకి ఏ విభాగంలో పురస్కారం లభించింది? అనే ప్రశ్న అడిగారు. తాజాగా ఇప్పుడు గ్రూప్- 4 పరీక్షలో బలగం మూవీ పై ఒక ప్రశ్న అడిగారు. బలగం చిత్రానికి సంబంధించిన క్రింది జతలలో ఏవి సరిగా జతపరచబడినవి? అనే ప్రశ్నకు ఏ. దర్శకుడు : వేణు యెల్దండి, బి. నిర్మాత : దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి సి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, డి. కొమురయ్య పాత్రను పోషించినవారు : అరుసం మధుసూదన్. దీనికి సమాధానం ఏ,బీ,సీ,
ఇదిలా ఉంటే ఈ ఏడాది జరిగిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షలో ‘మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో బలగం సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించింది?’ అనే క్వశ్చన్ అడిగారు. ‘బలగం చిత్రానికి సంబంధించి కింది జతలలో ఏవి సరిగ్గా జతపరిచినవి?’ ఎ. దర్శకుడు: వేణు యెల్దండి, బి. నిర్మాత: దిల్ రాజు, హన్షితా రెడ్డి, హర్షిత్ రెడ్డి, సి.సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, డి. కొమరయ్య పాత్రను పోషించినవారు: అరుసం మధుసూధన్. దీనికి సమాధానం ఏ, బీ, సీ కాగా బలగం సినిమాలో కొమరయ్య పాత్రను కేతిరి సుధాకర్ రెడ్డి పోషించారు. ఇక తెలంగాణ సంస్కృతి ‘పిట్టకు పెట్టుడు’ నేపథ్యంలో వచ్చిన ‘బలగం’ సినిమా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. బంధాలు, బంధుత్వాల విలువ ఏంటో చూపించారు.