బీహార్- దేశంలో చట్టాలు ఎంత కఠినతరం అయినప్పటికీ హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఓ చోట మహిళలపై ఎవరో ఒకరు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇలాంటి అత్యాచార కేసులు చాలా వరకు పోలీసుల వరకు రాడవం లేదు. కొన్ని ఘటనలు మాత్రమే పోలీసుల దృష్టికి వస్తున్నాయి. కానీ ఇక్కడో విచిత్రమైన అత్యాచారం కేసు ఒకటి బీహార్ పోలీసులకు తలనొప్పిగా మారింది. అదేంటీ.. విచిత్రమైన అత్యాచారం ఎలా ఉంటుందని అనుకుంటున్నారా.. అసలేం జరిగిందంటే..
బీహార్‌కు చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. ఓ మాంత్రికుడు తనపై తరుచూ అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది. ఐతే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఆ మహిళ ఆరోపిస్తున్నట్లు ఆ మాంత్రికుడు ఆమెపై నేరుగా అత్యాచారం చేయలేదట. అప్పుడప్పుడు కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడట. బీహార్‌లోని గాంధీ మైదాన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కుమారుడు గతేడాది చివర్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆమె తన కుమారున్ని ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లింది.
దీంతో ఆ మాంత్రికుడు ఆ మహిళ కుమారుడు కోలుకోవడానికి కొన్ని పూజలు చేశాడు. అయితే ఆ తర్వాత 15 రోజులకే ఆమె కుమారుడు చనిపోయాడు. దీంతో ఆమె చతుర్వేది ఇంటికి వెళ్లి అతడిని నిలదీసింది. ఆ సమయంలో చతుర్వేది తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అప్పుడు తన కుమారుడు వచ్చి రక్షించాడని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మాంత్రికుడు చతుర్వేది పలుమార్లు కలలోకి వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చతుర్వేదిని స్టేషన్ కు పిలిపించి విచారించారు. అయితే ఆ మహిళను ఇప్పటివరకు తను ఒక్కసారి కూడా చూడలేదని చతుర్వేది పోలీసులకు చెప్పాడు. దీంతో మరోసారి మహిళను ప్రశ్నించగా, తనపై కలలో అత్యాచారానికి పాల్పడుతున్నాడని చెప్పడంతో ఏంచేయాలో పాలుపోక పోలీసులు తలలు పట్టుకున్నారు.