విజయవాడ క్రైం- సమాజంలో చాలా మంది పెడదారి పడుతున్నారు. అందుకు అనుగునంగా ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న భార్యను మోసం చేస్తూ భర్త, మరోవైపు కట్టుకున్న భర్తను మోసం చేస్తూ కొంత మంది భార్యలు వారిని మోసం చేస్తూ వేరేవాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి అక్రమ సంబంధాలవల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కొన్ని సందర్బాల్లో అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్న ఘటనలను మనం చూస్తున్నాం.
ఇదిగో తాజాగా విజయవాడలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విజయవాడలో ఓ వ్యక్తి భార్య పోలీస్ కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త చాలా సార్లు ఆమెను హెచ్చరించాడు. అలాంటి వ్యవహారాలు మానుకోవాలని మందిలించాడు. కానీ అలాంటిది ఏమీ లేదని, ఎవరితోనైనా తిరగడం నీవు చూశావా అని ఆమె భర్తను దబాయిస్తూ వచ్చేది.
దీంతో ఎలాగైనా తన భార్య అక్రమ సంబందం పెట్టుకున్న కానిస్టేబుల్ తో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఆ భర్త భావించాడు. ఇటివంటి సమయంలో భార్య పనిమీద బయటకు వెళ్తున్నానని చెప్పి కానిస్టేబుల్ ను కలవడానికి వెళ్లింది. ఇది గమనించిన ఆమె భర్త, పోలీసులతో సహ వారు వెళ్లిన హోటల్ కు వెళ్లాడు. ఇంకేముంది హోటల్ రూంలో తన భార్య సరసాల్లో మునిగి ఉండగా డోర్ కోట్టారు.
కంగారు పడిన కానిస్టేబుల్ మెల్లిగా వచ్చి రూం డోర్ తీసి చూడగా వచ్చింది తన ప్రియురాలి భర్త, పోలీసులు. దీంతో ఖంగు తిన్న కానిస్టేబుల్ తెల్లమొహం వేశాడు. రూంలో వెతకగా తన భార్య కనిపించలేదు. ఎందుకంటే ఆమె బాత్ రూంలో దాక్కుంది. పోలీసులు, భర్త డోర్ కొట్టడంతో మెల్లిగా డోర్ తీసి బయటకు వచ్చింది అతని భార్య. తాము కేవలం మాట్లాడుకోవడానికి వచ్చామని వారిద్దరు చెప్పడం కొసమెరుపు. అన్నట్లు ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట. మరి ఇదేంపోయే కాలం అని ఈ వీడియో చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు.