అందం కోసం స్పా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు ధనవంతులు. అయితే ఇప్పుడు ఈ స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు రాజ్యమేలుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్పా, థెరఫీ సెంటర్లలో మసాజ్‌ల పేరిట కామ కలాపాలు సాగిస్తున్నారు దాని యజమానులు.
అందం కోసం స్పా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు ధనవంతులు. అయితే ఇప్పుడు ఈ స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు రాజ్యమేలుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్పా, థెరఫీ సెంటర్లలో మసాజ్‌ల పేరిట కామ కలాపాలు నిర్వహిస్తున్నారు దాని యజమానులు. ఉద్యోగాల పేరిట అమ్మాయిలను వల వేసి.. వారిని ఎరగా చూపి..కస్టమర్లను రాబట్టుకుని, ఆ తర్వాత స్పా పేరుతో వ్యభిచారం సాగిస్తున్నారు. పోలీసులకు తెలిసినా కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని సార్లు రైడ్స్ చేసి పట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో అనేక స్పా సెంటర్లపై దాడులు చేసి వాటి గుట్టురట్టు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ కల్చర్ విజయవాడ నగరానికి పాకింది.
స్పా సెంటర్ ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పా సెంటర్ పై దాడి చేసి గుట్టు బయటపెట్టారు. భవానీ పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానీపురం బైపాస్ రోడ్డు దియాస్ బార్ సమీపంలోని ఓ భవనంలో నగరానికి చెందిన సంపర శ్రీ విద్య అనే మహిళ.. తనిష్క బ్యూటీ వరల్డ్ అండ్ స్పా నిర్వహిస్తోంది. అయితే ఈ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దానిపై దాడి చేశారు. సంపర శ్రీ విద్య, ఆమె భర్త సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో స్పా సెంటర్‌లో 11 మంది యువతులు, ముగ్గురు విటులు ఉన్నారు. స్పా సెంటర్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.