స్పోర్ట్స్ డెస్క్- సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిదే.. కానీ ఒక్కోసారి పక్కవారు చెప్పేది కూడా వినాలని అని మన పెద్ద వాళ్లు చెబుతుంటారు. కానీ మన మంచి చెప్పే వారి మాట పెడచెవిన పెడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరిగింది. రిషబ్ పంత్ చెప్పిన మాటను పట్టించుకోకపోవడంతో చిక్కుల్లో పడ్డారు కోహ్లీ.
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ వద్దని వారిస్తున్నా రివ్యూ కోరిన విరాట్ కోహ్లీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 23వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్, నాలుగో బంతిని వికెట్లని టార్గెట్ గా చేసుకుని విసిరాడు. ఆ బంతిని డిఫెన్స్ చేసేందుకు జో రూట్ ప్రయత్నించాడు. అయినప్పటికీ కాస్త పక్క నుంచి వెళ్లిన బంతి, బ్యాట్‌కి తాకకుండా ఫ్యాడ్‌ని తాకుతూ వెళ్లింది. దీంతో ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం భారత్ అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ అంగీకరించలేదు.
బంతి కచ్చితంగా వికెట్లని తాకేలా కనిపించిందని ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చెప్పడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ రివ్యూ కోరేందుకు సిద్దమయ్యాడు. ఐతే బాల్ లెగ్ స్టంప్‌కి అవతల వెళ్లిందని, రివ్యూ వద్దని రిషబ్ పంత్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూచించాడు. కానీ పంత్ మాట వినిపించుకోకుండా కోహ్లీ రివ్యూ కోరేలా కనిపించడంతో, మరోసారి వారిస్తూనే కోహ్లీ చేతుల్ని పక్కకి తీసేందుకు కూడా ట్రై చేశాడు రిషబ్ పంత్.
పంత్ మాట ఏ మాత్రం లెక్కచేయని కోహ్లీ రివ్యూ కోరాడు. అంతే కాదు పంత్‌పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి రిప్లైలో బంతి లెగ్ స్టంప్‌కి దూరంగా వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఇంకేముంది క్రికెట్ అభిమానులు కోహ్లీపై ఫైర్ అవుతున్నారు. రిషబ్ పంత్ వద్దని చెప్పినా రివ్యూ కోరిన విరాట్ కోహ్లీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
Mohammad Siraj convinced Virat Kohli to take the review of Joe Root, but Rishabh Pant was denying. pic.twitter.com/WepEASpDWH
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 13, 2021
Kohli , Siraj and pant discussing whether to take review or not. pic.twitter.com/5ydv2mwuYk
— Avneet Singh (@AvneetsinghAs) August 13, 2021