భారత్, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ అంటే అభిమానులే కాదు.. ఆటగాళ్లకు కూడా అదోరకమైన ఉత్సాహం ఉంటుంది. ‘లగాన్’ సినిమా మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంటుంది. ఒకప్పటి భారత క్రికెట్‌లో ప్రత్యర్థి ఆటగాడు రెచ్చగొడితే మనవాళ్లు బాల్, బ్యాటుకు మాత్రమే పని చెప్పేవారు. బౌలర్ అయితే వికెట్ తీసి నోరు మూపించడం.. బ్యాట్స్ మెన్ అయితే బౌండ్రీ బాది నోటి మీద వేలు వేయించేవారు. కానీ, రోజులు మారాయి. ఇప్పటి టీమిండియా అయితే చేతలే కాదు, మాటలతోనూ ప్రత్యర్థి జట్లకు […]
లార్డ్స్ వేదికగా భారత్ ఖాతా తెరిచింది. రెండో టెస్టులో అద్భుత విజయంతో జయకేతనం ఎగురవేసింది. డ్రాగా ముగిస్తే చాలు అని కోరుకున్న అభిమానులకు 151 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందించింది టీమిండియా. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో పూర్తి ఆధిపత్యం సాధించింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 250 బంతుల్లో 129 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నాటింగ్‌హామ్‌లో మొదటి టెస్టు వర్షం కారణంగా అంతంతమాత్రంగానే జరిగి […]
స్పోర్ట్స్ డెస్క్- లార్డ్స్ మైదానంలో భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులు విపరీత ధోరణిితో ప్రవర్తించారు. మూడో రోజు తొలి సెషన్‌లో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కొందరు రాహుల్‌పై షాంపేన్ కార్క్స్ విసిరారు. కేఎల్ రాహుల్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సందర్బంలో చాలా షాంపేన్ కార్కులు అతడి దగ్గర్లో వచ్చి పడ్డాయి. దీన్ని గమనించిన కామెంటేటర్లు సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. […]
స్పోర్ట్స్ డెస్క్- సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిదే.. కానీ ఒక్కోసారి పక్కవారు చెప్పేది కూడా వినాలని అని మన పెద్ద వాళ్లు చెబుతుంటారు. కానీ మన మంచి చెప్పే వారి మాట పెడచెవిన పెడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరిగింది. రిషబ్ పంత్ చెప్పిన మాటను పట్టించుకోకపోవడంతో చిక్కుల్లో పడ్డారు కోహ్లీ. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ వద్దని వారిస్తున్నా […]
స్పోర్స్ట్ డెస్క్- లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకి తృటిలో సెంచరీ మిస్ అయ్యింది. మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. నిలకడగా ఆడిన రోహిత్ శర్మ 83 రన్స్ దగ్గర అనూహ్యరీతిలో వికెట్ కోల్పోయాడు. భారత్ వెలుపల టెస్టుల్లో రోహిత్ శర్మకి ఇదే అత్యుత్తమ స్కోరు అని చెప్పవచ్చు. మొత్తం 115 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ తో 83 […]