లార్డ్స్ వేదికగా భారత్ ఖాతా తెరిచింది. రెండో టెస్టులో అద్భుత విజయంతో జయకేతనం ఎగురవేసింది. డ్రాగా ముగిస్తే చాలు అని కోరుకున్న అభిమానులకు 151 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందించింది టీమిండియా. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో పూర్తి ఆధిపత్యం సాధించింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 250 బంతుల్లో 129 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నాటింగ్‌హామ్‌లో మొదటి టెస్టు వర్షం కారణంగా అంతంతమాత్రంగానే జరిగి డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన భారత మూడో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకూ కపిల్‌దేవ్ (1986), మహేంద్రసింగ్ ధోనీ (2014) మాత్రమే అక్కడ కెప్టెన్‌గా విజయం సాధించారు.
రెండో టెస్టు చివరిరోజు 181/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన టీమిండియా షమీ, బుమ్రా మెరుపులతో 298/8 వద్ద డిక్లేర్ చేశారు. క్రీజులో అప్పటికి షమీ 70 బంతుల్లో 56 పరుగులు, బుమ్రా 64 బంతుల్లో 34 పరుగులు చేసున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల ఆధిక్యం సాధించిన ఇంగ్లాండ్ ముందు టీమిండియా 272 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచారు.
భారీ అంచనాలతో ఛేదన మొదుల పెట్టిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్లు ఏ దశలోనూ ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్ల దాటికి తేలిపోయారు. ఐదుగురు డకౌట్లుగా పెవిలియన్ చేరడమే అందుకు ఉదాహరణ. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే… రోరీ బర్న్స్ (0), డామ్ సిబ్లీ (0), హమీద్ (8), కెప్టెన్ జో రూట్(33), బెయిర్‌స్టో (2), జోస్ బట్లర్ (25), మొయిన్ అలీ (13), శామ్ కరన్ (0), ఓలీ రాబిన్సన్ (9), మార్క్‌వుడ్ (0) జేమ్స్ అండర్సన్ (0) కూడా ఆఖరి వికెట్‌గా ఔటయ్యాడు. జో రూట్, బట్లర్, మెయిన్ అలీ మినహా ఎవరూ రెండకెలా స్కోర్ నమోదు చేయలేకపోయారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. జస్‌ప్రీత్ బుమ్రా మూడు, ఇషాంత్ శర్మ రెండు, మహ్మద్ షమీ ఒక వికెట్ తీశారు.
?゚ヌᄈ’s wagging tail, 10 English wickets and the special running celebrations sealed the deal for India at Lord’s ?゚マᄑ
Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! ?#ENGvINDOnlyOnSonyTen #ENGvIND #ENGvsIND pic.twitter.com/ECZY9OVRyu
— Sony Sports (@SonySportsIndia) August 16, 2021
హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ లార్డ్స్ టెస్టులో తన మార్క్‌ను చూపించాడు. అతని పని అయిపోయింది.. ఇంకా ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అని అంటున్న వారందరికీ తన బాల్‌తోనే సమాధానం చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో రెండో టెస్టులో మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. వికెట్ తీసిన వెంటనే నోటిమీద వేలేసుకుని ఇదే నా సమాధానం అంటూ సెలబ్రేషన్ చేసుకున్నాడు సిరాజ్.
W ?゚マᄑ W ?゚マᄑ!
Siraj gets two-in-two and we just came back from a running celebration ?Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! ?#ENGvINDOnlyOnSonyTen #ENGvIND #Siraj pic.twitter.com/J92nItabzU
— Sony Sports (@SonySportsIndia) August 16, 2021
రెండో టెస్టు ఘన విజయంగా నిలవడంలో షమీపాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే… ఎప్పుడూ బాల్‌తో చెలరేగే షమీ ఈసారి బ్యాట్‌తోను విరుచుకుపడ్డాడు. 92 మీటర్ల భారీ సిక్స్ బాది సెహ్వాగ్ స్టైల్ తన టెస్టు కెరీర్లో రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు షమీ. రెండో ఇన్నింగ్స్‌లో 70 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదర్ ఎండ్‌లో బుమ్రా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 64 బంతుల్లో మూడు ఫోర్లు బాది 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
A humongous six brings up the 50 for Shami, along with a huge round of applause at Lords! ?゚ヌᄈ
Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! ?#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #Shami pic.twitter.com/etS5lmHKNr
— Sony Sports (@SonySportsIndia) August 16, 2021
రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకి ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (129) టాప్ స్కోరర్‌కాగా.. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ (5/62) ఐదు వికెట్ల పడగొట్టాడు. తర్వాత ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటై 27 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్ జో రూట్(180) రికార్డు శతకం నమోదు చేశాడు. మహ్మద్ సిరాజ్ (4/94), ఇషాంత్ శర్మ (3/69) ఆకట్టుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో రహానే (61), షమీ(56*), పూజారా(45) పరుగులు చేశారు. ఇక మూడో టెస్టు మ్యాచ్ లీడ్స్ వేదికగా ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది.