స్పోర్ట్స్ డెస్క్- లార్డ్స్ మైదానంలో భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులు విపరీత ధోరణిితో ప్రవర్తించారు. మూడో రోజు తొలి సెషన్‌లో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కొందరు రాహుల్‌పై షాంపేన్ కార్క్స్ విసిరారు. కేఎల్ రాహుల్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సందర్బంలో చాలా షాంపేన్ కార్కులు అతడి దగ్గర్లో వచ్చి పడ్డాయి. దీన్ని గమనించిన కామెంటేటర్లు సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఇలా టీంఇండియా ఆటగాడు కేఎల్ రాహూల్ పై షాంపేన్ కార్క్స్ విసరడాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లీ సీరియస్ గా తీసుకున్నాడు. ఈ ఘటనపై కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. తనపైకి విసిరిన షాంపేన్ కార్క్స్ తిరిగి వారిపైకే విసరాలని రాహూల్ కు సూచించాడు కోహ్లీ. ఈ విషయాన్ని ఎంపైర్ల దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇలా మరో జట్టు ప్రేయర్ ను అవమానించడం సరికాదనే కామెంట్స్ గట్టిగా వినపించాయి.
ఐతే ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని అని ఎంపైర్లు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ తర్వాత తొలిసారి పూర్తిస్థాయి సామర్థ్యంతో లార్డ్స్ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తుండగా, పర్యాటక టీంఇండియా జట్టుపై ఇంగ్లండ్ అభిమానుల అనుచిత ప్రవర్తన విమర్శలకు తావిస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల ప్రవర్తనపై చాలా మంది ఫైర్ అవుతున్నారు.
#Kohli mass 🔥🔥
Crowd threw something on the ground where KL Rahul is standing !
Kohli signals KL to throw it out of the ground#ENGvIND #Kohli#IndvsEng pic.twitter.com/ZjIRm3JEqj
— Gowtham ᴹᴵ (@MGR_VJ) August 14, 2021