స్పోర్స్ట్ డెస్క్- లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకి తృటిలో సెంచరీ మిస్ అయ్యింది. మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. నిలకడగా ఆడిన రోహిత్ శర్మ 83 రన్స్ దగ్గర అనూహ్యరీతిలో వికెట్ కోల్పోయాడు. భారత్ వెలుపల టెస్టుల్లో రోహిత్ శర్మకి ఇదే అత్యుత్తమ స్కోరు అని చెప్పవచ్చు. మొత్తం 115 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ తో 83 రన్స్ చేశాడు.
శ్రీలంకతో 2015లో జరిగిన టెస్టుల్లో రోహిత్ శర్మ చేసిన 79 పరుగులే ఇప్పటి వరకూ అత్యధిక స్కోర్. రోహిత్ శర్మ ఇప్పటివరకు వీదేశాల్లో కనీసం ఒక్క టెస్టు సెంచరీ కూడా చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మ్యాచ్ లో 44వ ఓవర్ వేసిన జేమ్స్ అండర్సన్ పక్కా స్కెచ్ తో రోహిత్ శర్మ వికెట్ తీశాడు. ఆ ఓవర్‌లో తొలి రెండు బాల్స్ ను ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వేసిన జేమ్స్ అండర్సన్, మూడో బాల్ ను ఔట్ స్వింగర్ రూపంలో వేశాడు. ఇక నాలుగో బాల్ ను సైతం అదే తరహాలో ఊహించిన రోహిత్ శర్మ ఆ మేరకు బంతిని ఎదుర్కొనేందుకు ప్రిపేర్ అయ్యాడు.
ఐతే నాలుగో బంతిని అనూహ్యంగా ఇన్ స్వింగర్ రూపంలో అండర్సన్ సంధించడంతో, రోహిత్ శర్మ ఆ బంతిని ఎదుర్కోలేకపోయాడు. రోహిత్ శర్మ ఫ్యాడ్‌ని తాకుతూ వెళ్లిన బంతి స్టంప్‌లను తాకేసింది. మొదటి సెషన్ లో బౌలర్ శామ్ కరన్ వేసిన ఒక ఓవర్‌లో నాలుగు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ, స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లోనూ బాగానే బాదాదు. కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ సెంచరీ సమీపానికి వెళ్లాడు. కానీ 83 పరుగుల వద్ద ఔటయ్యాడు.