ఫిల్మ్ డెస్క్- నాగచైతన్య, సమంత.. ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్లిద్దరి గురించే చర్చ జరుగుతోంది. సమంత, నాగచైతన్యలు విడిపోయారని, త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. డైవోర్స్ వార్తలను ఇద్దరిలో ఒక్కరు కూడా ఖండించకపోవడం, అక్కినేని కుటుంబ సభ్యులు ఎవ్వరు దీనిపై స్పందించకపోవడంతో నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకోవడం ఖాయమని టాలీవుడ్ వర్గాలతో పాటు, అభిమానులు అనుకుంటున్నారు.
ఇదిగో ఇటువంటి సమయంలో ప్రముఖ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సమంత, నాగచైతన్య విడాకుల అంశంపై స్పందించారు. తాను మూడున్నరేళ్ల క్రితమే సమంత, నాగచైతన్య జాతకం చెప్పానంటూ ఆయన గుర్తు చేస్తున్నారు. వీళ్లిద్దరి జాతకం తన దగ్గర ఉందని, మూడున్నరేళ్ల క్రితమే వీళ్లు విడిపోతారని తాను చెప్పిన సంగతిని వేణుస్వామి రిమైండ్ చేస్తున్నాడు. కావాలంటే మూడున్నరేళ్ల క్రితం తన ఇంటర్వూను చూడండని అంటున్నాడు.
సమంత, నాగచైతన్యలకు పెళ్లి కాకముందు, వాళ్లిద్దరు ప్రేమించుకుని, ఇక పెళ్లిచేసుకుంటారన్న సమయంలో, 2018 ఫిభ్రవరిలో వేణు స్వామి ఓ ఇంటర్వూలో ఈ విషయం చెప్పారు. వీళ్లిద్దరు గురించి ఆయన ఏమన్నారంటే.. నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే కోపం ఏం లేదు.. గతంలో అక్కినేని అఖిల్‌కి ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. ఆ టైంలో అది చాలా వెబ్ సైట్స్‌లలో రావడంతో నాగార్జున మీ మీది కేసు వేస్తారట అదీ ఇదీ అన్నారు.. కానీ కొన్నాళ్లకు నేను చెప్పినట్టుగానే అఖిల్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది.. నేను జాతకాలను విశ్లేషించి ఏం జరుగుతుందో చెప్తాను.. అఖిల్ గురించి కూడా అలాగే చెప్పాను.. అని అన్నారు.
అంతే కాదు.. అఖిల్ మ్యారేజ్ జరగదు.. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పాను అలాగే అయ్యింది. టైం లేకపోయినా నేను జాతకం చెప్పగలను.. అలాగే నాగచైతన్య, సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను.. ఎలాంటి సమస్యలు అంటే వాళ్లిద్దరి మధ్య గ్యాప్ రావచ్చు.. విడిపోవచ్చు.. సంతానం కలగకపోవచ్చు.. పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు వస్తాయి.. సమంత అమావాస్య నాడు పుట్టింది.. దాని వల్ల చైతూకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్నది విశ్లేషించి చెప్పాను.. సినిమాల పరంగా వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. బాగా రాణిస్తారు.. అని చెప్పుకొచ్చారు.
ఇక.. పెళ్లి చేసుకున్నా సమంత సినిమాల్లో కంటిన్యూ అవుతుందని వేణు స్వామి చెప్పారు. సమంత, నాగ చైతన్యల వైవాహిక జీవితం ఎలా ఉంటుందో పెళ్లికి ముందే అప్పట్లో చెప్పానని గుర్తు చేస్తున్నారు. దీంతో మరోసారి వేణుస్వామి ఇంటర్వూ ఆసక్తికరంగా మారింది. మరి ఇప్పుడైనా అక్కినేని కుటుంబం ఈ వివాదాస్పద అంశంపై స్పందించి, వివవరణ ఇస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.