హైదరాబాద్- సమాజంలో నేరాలు, ఘోరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పరాయివాళ్లు కాదు, సొంత వాళ్లే అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. తాజాగా తండ్రి, కన్న కొడుకుపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది.
ఈ అమానుష ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడిపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితుడి తల్లి వీణారెడ్డి శుక్రవారం మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పింది.
తన భర్త గోనె భరత్‌రెడ్డి హోమో సెక్సువల్ కావడంతో, అతని వేధింపులను భరించలేక దూరంగా ఉంటున్నానని ఆమె తెలిపింది. కామంతో కళ్లు మూసుకుపోయిన తన భర్త భరత్ రెడ్డి సొంత కుమారుడినే చెరపట్టాడని మీడియా ఎదుట చెప్పుకుని కన్నీరుమూన్నీరైంది. భార్యాభర్తలుగా తాము విడిపోయి ఉంటున్న క్రమంలో భరత్ రెడ్డి తనను మభ్యపెట్టి కుమారుడిని అతని వద్దే ఉండేలా చేసుకున్నాడని వీణారెడ్డి చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలో తన కొడుకుపై భరత్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె తెలిపింది. తన కొడుకుపై కర్కషంగా వ్యవహరించిన గోనె భరత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీణారెడ్డి డిమాండ్ చేసింది. అతని చెర నుంచి తన కొడుకును కాపాడాలని పోలీసులను వేడుకుంది.