హైదరాబాద్- సమాజంలో నేరాలు, ఘోరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పరాయివాళ్లు కాదు, సొంత వాళ్లే అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. తాజాగా తండ్రి, కన్న కొడుకుపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ అమానుష ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడిపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితుడి తల్లి వీణారెడ్డి శుక్రవారం మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పింది. […]