భార్యాభర్తల మధ్య వివాదాలు చోటు చేసుకోవడం సహజం. అలా వారి సమస్యలను ఇద్దరు కుర్చుని పరిష్కరించుకుంటే సరిపాయే, లేదంటే వారి సంసారం రోడ్డున పడి రచ్చకెక్కుతుంది. అలా ఓ అలుమగల పంచాయితి చినిగి చినిగి గాలి వానలా తయారై తీవ్ర గొడవకు దారి తీసింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిడమనూరు మండలం బొక్కమంతులపాడ్‌లో గ్రామానికి చెందిన శివనారాయణ అనే వ్యక్తితో శ్యామల అనే యువతితో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరి పెళ్లైన కొంత కాలం సంతోషంగానే ఉన్నారు.
ఇక రోజులు గడిచే కొద్ది వీరి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. మొదట్లో కామన్ అని భావించిన శ్యామల తల్లిదండ్రులు, రాను రాను అలుమగల పంచాయితి శృతిమించడంతో వారు తట్టుకోలేకపోయారు. అయినా సరే అని కొన్ని సార్లు గ్రామ పెద్దలతో పంచాయితీ పెట్టించి సర్దుకోమని చెప్పించారు. కానీ వీరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మళ్లీ వివాదాలు తరుచు జరుగుతూనే ఉన్నాయి. భరించలేకపోయిన శ్యామల తల్లిదండ్రులు మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో భర్త శివనారాయణ ఇంటికి వెళ్లారు. వెళుతు వెళుతూనే వెంట తెచ్చకునే కత్తులు, కారంతో నానా రచ్చ చేశారు.
ఇంట్లో ఉన్న శివనారాయణ తల్లిదండ్రులపై, శివనారాయణపై కూడా కత్తులతో దాడి చేస్తూ కంట్లో కారం చల్లి పరారయ్యారు. ఈ దాడిలో శివనారాయణ తల్లి అచ్చమ్మ తీవ్రంగా గాయలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడ్డ శివనారాయణను, తండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక శివనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటన స్థలాన్ని పరామర్శించారు. ఆ తర్వాత నిందితులు వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. చినిగి చినిగి గాలి వానల మారిన అలుమగల పంచాయితిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.