స్వల్పంగా తగ్గిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 100 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 110 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,850.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,930.
1కిలో వెండి 68,800
బిజినెస్ డెస్క్- ఈ రోజు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 10 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 11 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గి 44 వేల 850 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 110 రూపాయలు తగ్గి 48 వేల 930 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 300 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 68 వేల 800 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 400 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 440 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 120 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,220 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,040 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48,040 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,090 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,370 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.