22 క్యారెట్ 10గ్రా బంగారం 45,700.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,850.
1కిలో వెండి 65,960బిజినెస్ డెస్క్- ఈ రోజు సోమవారం బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు. శనివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 45 వేల 700 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 49 వేల 850 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి కిలో 40 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 65 వేల 960 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 600 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 650 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 910 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 50,100 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,690 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48,690 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,850 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 52,200 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.