ఆంధ్రప్రదేశ్- తిరుమల తిరుపతి దేవస్థానం.. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్కామి కొలువైన ఉన్నారని భక్తుల న్మమకం. కేవలం మన దేశం నలువైపుల నుంచే కాకుండా, ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు తిరుమలకు వస్తుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఒక్క సారి దర్శించుకోవాలని భక్తులు ఆరాటపడిపోతుంటారు. ఐతే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే మాత్రం కొంత ప్రయాసపడాల్సిందే.
ఎందుకంటే ప్రతి రోజు కొండపైకి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి, శ్రీవారి దర్శనం అంత సులభం కాదు. అందులోను కరోనా నేపధ్యంలో రోజు వారి దర్శనాలను బాగా తగ్గించింది టీటీడీ. ఇదిగో ఇటువంటి సమయంలో భక్తులకు తిరుమల చిరుపతి దేవస్థానం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐతే ఇది బాగా డబ్బున్న శ్రీమంతులకు మాత్రమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే టీటీడీ ఇచ్చిన ఆఫర్ వించే సామాన్య, మద్య తరగతి వారికి కల్లు బైర్లు కమ్ముతాయి మరి.
చాలా కాలం క్రితం రద్దు చేసిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవకు మళ్లీ భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈమేరకు ఉదయాస్తమాన సేవ టికెట్ ధరను తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీప్రకటించింది. సాధారణ రోజుల్లో అయితే కోటి రూపాయలు, శుక్రవారం అభిషేకం, మేల్‌ఛాట్ వస్త్రం సేవలు ఉన్న క్రమంలో టికెట్ ధర 1.50 కోట్లుగా టీటీడీ నిర్ణయించింది. తాజాగా జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
2006లో ఉదయాస్తమాన సేవను రద్దు చేసిన టీటీడీ, అప్పటి నుంచి మిగిలిపోయిన 531 టికెట్లను భక్తులకు కేటాయించాలని నిర్ణయించింది. ఉదయాస్తమాన సేవ టికెట్లు కలిగిన భక్తులు సంవత్సరంలో ఒక రోజు శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది. గతంలో ఉదయాస్తమాన సేవ టిక్కెట్ ధర లక్ష రూపాయలు, శుక్రవారం రోజు5 లక్షలుగా ఉండేది. కానీ భక్తుల డిమాండ్ పెరగడంతో 2006లో ఈ సేవను నిలిపివేసింది టీటీడీ.
వివిధ కారణాలతో కొన్ని టికెట్లు రద్దు కావడంతో పాటు మరికొన్ని కాలపరిమితి పూర్తి కావడంతో దాదాపు 531 టికెట్ల వరకూ ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని నిర్ణయించిన ధర్మకర్తల మండలి వాటి ధరను కోటిగా, శుక్రవారం 1.50 కోట్లుగా నిర్ణయించింది. ఈ టికెట్లు కొనుగోలు చేసే భక్తులకు దాదాపు 25 ఏళ్ల పాటు ఏడాదిలో ఒక్క రోజు వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు జరిగే ఆర్జితసేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
ఇక ఉదయాస్తమాన సేవ టిక్కెట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ కింద కేటాయించనున్నారు. ఈ సేవ ద్వారా టీటీడీకి సుమారు 600 కోట్లు లభించనుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తంతో తిరుపతిలో చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.