గుజరాత్- ఈ మధ్య కాలంలో ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్డు ప్రమాదాలు ఐతే ఇక చెప్పక్కర్లేదు. దేశంలో ప్రతి నిమిషానికి ఓ రోడ్డు ప్రమాదం జరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, చాలా మంది అంగవైకల్యం పొందుతున్నారు. ఐతే కొన్ని ప్రమాదాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రమాదాల్లో కొంత మంది తృటిలో ప్రాణాలతో బయటపడుతుంటారు.
ఇదిగో గుజరాత్ రాష్ట్రంలో ఇలాగే జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు కింద పడ్డ వ్యక్తి పనైపోయిందని అంతా అనుకున్నారు. ఇక బాడీ బయటకు తీయాల్సిందేనని అంతా భావించారు. కానీ కాసేపటికి ఎంచక్కా బస్సు కింద నుంచి అతను లేచి వచ్చే సరికి అంతా అవాక్కయ్యారు. ఈ ఘటన గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతంలో జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బస్సును బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు.
ఐతే అక్కడ పెద్ద మలుపు ఉండటంతో అతడి బైక్ అదుపు తప్పి బస్సు కింద పడ్డాడు. దీన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే బ్రేక్ వెయ్యడంతో బస్సు ఆగిపోయింది. బైక్ కాస్త ముందుకు పడిపోయినా, అతడు మాత్రం బస్సు ముందు బాగం కిందకు వెళ్లిపోయడు. దీంతో అతడు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అంతా అనుకున్నారు. కానీ ఓ అర నిమిషం తరువాత మెల్లిగా అతడు బస్సు కింద నుంచి బయటకు వచ్చాడు.
తనకేమైనా గాయాలయ్యాయా అని చెక్ చేసుకున్నాడు. కానీ అతడికి ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. ఘటనకు సంబందించిన సీసీటీవీ ఫుజేట్ ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదృష్టం అంటే అతడిదే అని కొందరంటే, అతడికి ఈ భూమ్మీద ఇంకా నూకలున్నాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఎంతైనా లక్కీ ఫెలో కదా.
A youth in Gujarat’s Dahod had a miraculous escape after he was rashly run over by a bus he tried to overtake.pic.twitter.com/pLLOkYrbJB
— My Vadodara (@MyVadodara) September 15, 2021