ఇటీవల దేశంలో పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సాంకేతిక లోపాల వల్ల కొన్ని ప్రమాదాలు జరిగితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని జరుగుతున్నాయి. ఈ మద్యనే గుంటూరు జిల్లాలో కొంత మంది ఆకతాయిలు చేసిన పని వల్ల శబరి ఎక్స్ ప్రెస్ కు కు పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. తాజాగా షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుది. రైలు లో నుంచి ఒక్కసారే మంటలు చెలరేగడంతో విపరీతమైన పొగ అలుముకుంది. దీంతో రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అప్రమత్తమయ్యారు.. భయంతో పరుగులు తీశారు.
ఈ ఘటన శనివారం ఉదయం మహారాష్ట్రలోని నాసిక్ రైల్వే స్టేషన్ కి చేరుకున్న తర్వాత జరిగింది. కాలిపోతున్న రైలును నాసిక్ రైల్వే స్టేషన్‌కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అధికారులు సకాలంలో స్పదించడంతో మంటలు ఇతర బోగీలకు అంటుకోకుండా చూడగలిగారు. ట్రైన్ లోని పార్సిల్ బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు ఉన్న బోగీలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.
నాసిక్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత రైల్లో మంటలు రావడం చూసి ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.. పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారి శివాజీ సతర్ అన్నారు. మంటలు అదుపులోని తెచ్చేందుకు పార్సిల్ కోచ్ ని రైలు నుంచి సపరేట్ చేశామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.