ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం తప్పనిసరి అయ్యింది. కరోనా కారణంగా విద్యార్థుల చదవులు ఆన్‌లైన్ కావడంతో.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తుంది. పెరుగుతున్న వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సరికొత్త ఫీచర్స్, భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తూ.. వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ 5జీ ఫోన్‌పై ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. 13 వేలకే శాంసంగ్ 5జీ ఫోన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులోనూ ఓ అద్భుతమైన ఫీచర్‌తో. అదే ఆటో డేటా స్విచ్చింగ్ టెక్నాలజీ ఫీచర్. మరి అద్భుతమైన ఫీచర్లతో.. తక్కువ ధరకే లభిస్తున్న ఈ 5జీ ఫోన్ పై ఉన్న ఆఫర్లు వంటి తదితర వివరాలు..
శాంసంగ్ కొత్త చవకైన 5జీ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. అదే శాంసంగ్ గెలాక్సీ M13 5g. ఇందులో ర్యామ్ ప్లస్ ఫీచర్‌ను కూడా అందించారు. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. దీని ద్వారా ఫోన్ పెర్పార్మెన్స్ మెరుగవనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు. ఆటో డేటా స్విచ్చింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. అంటే ఒక సిమ్‌లో నెట్‌వర్క్ లేకపోతే రెండో సిమ్ సిగ్నల్ ద్వారా మొదటి సిమ్ నుంచి కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చన్న మాట.
శాంసంగ్ గెలాక్సీ M13 5g ధర..
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.13,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ఆక్వా గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ, స్టార్‌డస్ట్ బ్రౌన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్, అమెజాన్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో జులై 23వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అంటే బేస్ వేరియంట్ రూ.12,999కే కొనేయచ్చన్న మాట.
శాంసంగ్ గెలాక్సీ M13 5g స్పెసిఫికేషన్లు..
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 400 నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. దీన్ని ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 12 జీబీ వరకు పెంచుకోవచ్చు. 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ M13 5g పని చేయనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా బరువు 195 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై, 5జీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ సూట్ కూడా ఈ ఫోన్‌లో కంపెనీ అందించనుంది.
ఈ సేల్ ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. అమెజాన్, సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్ సేల్‌కు అందుబాటులోకి వస్తుంది. మరి శాంసంగ్ ప్రకటించిన ఈ ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.