అంగవైకల్యం-ఆత్మవిశ్వాసం ఈ రెండింటికి ఎప్పుడూ పోటీయే. సంకల్పబలం ఉంటే ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. అదే జరిగింది మరుగుజ్జు శివలాల్ విషయంలో, లక్ష్యాన్ని సాధించాలనే అతని పట్టుదలే అందరికీ ఆదర్శంగా నిలిపింది. పొట్టివాడివి అంటూ తోటివారు గేలి చేసినా అధైర్యపడలేదు. సమాజం చిన్నచూపు చూసిన చిరునవ్వుతో సమాధానం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ పూర్తి చేసి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి మరుగుజ్జుగా రికార్డు సృష్టించారు.
Hyderabad: Telangana State Road Transport Corporation (TSRTC) Managing Director, V.C Sajjanar, on Tuesday, took a ride alongside India’s first dwarf man to obtain a driving license, Gattipally Shivalal. Sajjanar felicitated the Limca book of records holder and appreciated his com pic.twitter.com/eivnoOAfeT
— Deccan News (@Deccan_Cable) January 12, 2022
హైదరాబాద్ బంజారాహిల్స్‌రోడ్ నంబర్–10లోని గౌరీశంకర్ కాలనీలో నివసించే 39 ఏళ్ల జి.శివలాల్ మరుగుజ్జు. బీకాం వరకు చదివిన ఇతను.. మరుగుజ్జు మహిళనే వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శివలాల్ తన ఎత్తుకు సరిపడా కారు క్లచ్, బ్రేక్‌లు ఏర్పాటు చేసుకొని మూడు నెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను తన కారులో ఎక్కించుకొని డ్రైవింగ్ చేయాలనే కోరిక ఉండేదని తెలిపాడు. ఇక తన కోరికను ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు తెలుపగా ఆయన స్పందించి.. శివలాల్ కారులో ఇంటి వరకు ప్రయాణించారు. మరుగుజ్జు అయినప్పటికీ అధికారులను ఒప్పించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అభినందనీయమని సజ్జనార్ అన్నారు. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న శివలాల్ భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరారు సజ్జనార్. ఈ మేరకు ఆయన శివలాల్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఈ మధ్యనే బాలయ్య హోస్ట్ గా వ్యవరిస్తున్న “అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే” షోకు పార్టిసిపెంట్ గా విచ్చేసిన శివలాల్ బాలయ్యతో సందడి చేశాడు.
Telangana | A Hyderabad man, Gattipally Shivpal becomes the first dwarf to receive a Driving license in India. Gattipally Shivlal is 42 years old and about 3 feet tall. He finished his degree in 2004 &was the first to complete the degree as a handicapped in his district. pic.twitter.com/phfhdT4oi8
— ANI (@ANI) December 4, 2021
తెలంగాణలో ఉన్న సుమారు 400 మంది మరుగుజ్జులలో డిగ్రీ చేసిన మొట్టమొదటివ్యక్తి శివలాల్. అంతేకాకుండా మొదటగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మరుగుజ్జు కూడా శివలాలే కావటం విశేషం.