రఘురామ కృష్ణరాజు ను పోలీసులు కొట్టారా.. నిన్న రాత్రి విచారణ సందర్భంగా రఘురామ కృష్ణరాజు పై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారా.. అంటే అవుననే అంటున్నారు రఘురామ కృష్ణరాజు. తనను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని అయ్యన్న ఆరోపించారు. హైదరాబాద్ నుంచి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు తనపై చేయి చేసుకున్నారని రఘురామ లాయర్లు జడ్జికి పిర్యాదు చేసారు. ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న రఘురామ రిమాండ్ రిపోర్ట్ సబ్ మీట్ చేసే సందర్భంగా కాస్త హైడ్రామా చోటుచేసుకుంది. సీఐడీ పోలీసులపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన లాయర్లు జడ్జికి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిప్పి పంపారు. మరోవైపు లాయర్ ఆదినారాయణరావు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక కోర్టుకు వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకున్నారని రఘురామ తరఫు లాయర్లు జడ్జికి పిర్యాదు చేసారు. మొత్తానికి తనను సీఐడీ పోలీసులు కొట్టారని రఘురామ కృష్ణరాజు ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది. అయితే పోలీసులు మాత్రం రఘురామ కృష్ణరాజు పై తాము చేయి చేసుకోలేదని చెబుతున్నారు. ఆయన కు ఆహారం అందించి, వసతి కల్పించామని చెబుతున్నారు.