ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి నటించిన ప్రముఖ నటుడు మృతి చెందారు.
ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మృతి చెందారు. నిన్న ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు మరణించారు. ఈయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ఈ వార్తని జీర్ణించుకునేలోపే మరో ప్రముఖ నటుడి మరణ వార్త అందరినీ కలచివేస్తుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు అకాల మరణం చెందారు. ఆ సినిమాలో స్కాట్ దొర పాత్రలో విలన్ గా నటించిన రే స్టీవెన్ సన్ (58) ఆదివారం ఇటలీలో మరణించారు. అయితే ఈయన మరణానికి కారణం తెలియాల్సి ఉంది.
ఈయన మరణ వార్త తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈయన అభిమానులు షాక్ కి గురయ్యారు. ఆయనతో కలిసి నటించిన నటులు, ఆత్మీయులు, సన్నిహితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంలో ఉన్న అందరికీ ఇది షాకింగ్ న్యూస్, మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు సర్ స్కాట్’ అంటూ ట్వీట్ చేసింది.ఈయన మృతిపై రాజమౌళి కూడా స్పందించారు. ‘షాకింగ్.. ఈ వార్తను నమ్మలేకపోతున్నాను. ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో తనతో పాటు విపరీతమైన ఎనర్జీ, ఉత్సాహం తీసుకొచ్చేవారు. ఆయనతో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని కలిగించేది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ట్వీట్ చేశారు.
ఐరిష్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన రే స్టీవెన్ సన్ నార్తర్న్ ఐర్లాండ్ లో 1964లోని మే 25న జన్మించారు. 1990ల్లో వచ్చిన టీవీ షోస్ ద్వారా ఆయన నటుడిగా కెరీర్ ప్రారంభించారు. 2000లో హాలీవుడ్ సినిమాల్లో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన మొదటి సినిమా ‘కింగ్ ఆర్థర్’. 2004లో వచ్చిన ఈ అడ్వెంచర్ సినిమాలో ఈయన ఆంటోని పాత్రలో నటించారు. పనిషర్: వార్ జోన్, కింగ్ ఆర్థర్, ది థార్ వంటి సినిమాల్లో నటించారు. రోమ్ లాంటి షోస్ లో కూడా నటించారు. ఈయన నటించిన అశోక సిరీస్ విడుదల కావాల్సి ఉంది. హాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నటించి మెప్పించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో తన విలనిజంతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇంకో రెండు రోజుల్లో పుట్టినరోజు ఉంది. ఈలోపే ఆయన మరణించారు. స్కాట్ దొరగా మెప్పించిన నటుడు రే స్టీవెన్ సన్ ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుందాం.
What shocking news for all of us on the team! 💔
Rest in peace, Ray Stevenson.
You will stay in our hearts forever, SIR SCOTT. pic.twitter.com/YRlB6iYLFi
— RRR Movie (@RRRMovie) May 22, 2023
Shocking… Just can’t believe this news. Ray brought in so much energy and vibrancy with him to the sets. It was infectious. Working with him was pure joy.
My prayers are with his family. May his soul rest in peace. pic.twitter.com/HytFxHLyZD
— rajamouli ss (@ssrajamouli) May 23, 2023