ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనగానే మొదటి నుంచి హైప్ మామూలుగా లేదు. రికార్డ్స్ తిరగరాయడం ఖాయమని జనాలు ఫిక్స్ అయిపోయారు. అయితే రిలీజ్ తర్వాత క్రియేట్ చేయాల్సిన రికార్డులు విడుదలకు ముందే సలార్ మూవీ చేస్తుంది. అదేంటంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా “సలార్“. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ మూవీని కూడా KGF తరహాలోనే రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. టీజర్లో ప్రభాస్ గురించి ఎలివేషన్స్ ఇస్తూ.. తాత చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ వచ్చేలా చేశాయి. ప్రభాస్‌ను సరికొత్త మాస్ గెటప్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్. KGF సిరీస్‌లతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ ఆడ్రస్ ప్రశాంత్ నీల్. అయితే సినిమా రిలీజ్‌కు ముందే “ఆర్ఆర్ఆర్” మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేసిందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది కూడా మన దేశంలో కాదు అమెరికాలో.
అమెరికాలోని అన్ని సినీ మార్క్ థియేటర్లలో సలార్ రిలీజ్ కాబోతుంది. అయితే అక్కడ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన “ఆర్ఆర్ఆర్” సినిమా 285 సినీ మార్క్ థియేటర్లలో విడుదలై రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఇప్పుడు ఆ సినిమాని ప్రభాస్ సలార్ అధిగమించిందని తెలుస్తోంది. అక్కడ ఏకంగా 1980కి పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ కానుందని “లార్ యూఎస్” డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. ఇదే విషయం నెట్టింట ట్రెండ్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ మరింత సంబరపడిపోతున్నారు. ప్రభాస్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ రికార్డ్స్ గల్లంతు కావల్సిందే అంటూ.. ప్రభాస్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. రికార్డ్స్ అనేవి శాశ్వతం కాదు, ఈరోజు సలార్ రికార్డ్ బ్రేక్ చేస్తే తరువాత దాని ప్లేస్‌లో మరో సినిమా రావచ్చు.
ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు అంటూ.. మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సలార్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇప్పటి వరకు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ తర్వాత సినిమాల విషయానికి వస్తే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “కల్కీ 2898 AD” చేస్తున్నారు. ఈ మధ్య గ్లింప్స్ రిలీజ్ అవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత మారుతితో ఒక సినిమా చేయబోతున్నాడు. మరి విడుదలకు ముందే సలార్ మూవీ రికార్డ్స్ ని క్రియేట్ చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
#Salaar gets the BIGGEST RELEASE EVER across Cinemark chain in USA. Excluding Latin America, about 315 theatres. 🔥🔥🔥
The previous highest from Indian Cinema was RRR. | #Prabhas pic.twitter.com/sWvKBxVl1M— Nishit Shaw (@NishitShawHere) August 8, 2023