ఆర్.నారాయణ మూర్తి. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. విలువలే ఆస్తిగా బ్రతుకుతున్న మనిషి ఆయన. తనకంటూ ఎన్నడూ, ఏది ఆలోచించుకోకుండా సమాజం కోసం పరితపించే ఆదర్శ వాది. సినిమా వ్యాపారం అయిపోయిన ఈరోజుల్లో కూడా.., ప్రజా సమస్యలపైనే సినిమాలు తీయడం మన పీపుల్స్ స్టార్ కే సాధ్యం అయ్యింది.
ఆర్. నారాయణ మూర్తి జీవితంలో చాలా సమస్యలపై పోరాటం చేశారు. ఈ ప్రయాణంలో ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. నటుడిగా సినిమాల్లో సంపాదించిందంతా.., సినిమాలు తీసే పోగోట్టుకున్నాడు. ఎప్పుడూ ఓ స్టార్ గా కాకుండా, సామాన్యడిగా సాదాసీదా జీవితం గడిపే ఆర్. నారాయణమూర్తి ఇప్పుడు తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్నారా అంటే సోషల్ మీడియాలో అవుననే సమాధానం వినిపిస్తోంది.
narayana-murthy-financial-situation
నారాయణ మూర్తి ఇప్పుడు రైతన్న అనే సినిమాని తెరకెక్కించారు. ‘‘రైతన్న’’ సినిమా ప్రీ రిలీజ్ మీట్ తాజాగా జరిగింది. ఈ మీట్కి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ప్రజా గాయకుడు గద్దర్, వామపక్ష నేత చాడ వెంకట రెడ్డి, కాంగ్రెస్ నేత కొందండ రెడ్డి, న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్, ఇతర రైతు సంఘము నాయకులు అతిధిలుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్.. నారాయణ మూర్తి ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులను బయట పెట్టారు.
నారాయణ మూర్తికి సోకులు నచ్చవు. ఆయనకు ఇళ్లు లేదు, భార్య లేదు. ఓ సిద్ధాంతం కోసం జీవితం మొత్తాన్ని అంకితం చేయడం అందరికీ సాధ్యం కాదు. ఈ ప్రయాణంలో ఆయన ఆస్తులు ఏమి మిగిల్చుకోలేదు. ప్రస్తుతం నారాయణ మూర్తి హైదరాబాద్‌లో ఇంటి కిరాయి కట్టలేక.., 50 కిమీ దూరం పోయి ఎక్కడో చిన్న అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.
మనం ఏమైనా సహాయం చేసినా తీసుకోడు. మా దగ్గర ఉండమని చాలా సార్లు చెప్పాము. అయినా ఉండడు. తన వ్యక్తిత్వం కూడా అలాంటిది కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం తప్ప.., ఇక దేని కోసం నారాయణ మూర్తి వెంపర్లాడడు అంటూ గద్దర్ స్పష్టం చేశారు. దీంతో..,నారాయణ మూర్తి ఆర్ధిక పరిస్థితి తెలిసి ఆయన అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.