ఫిల్మ్ డెస్క్- పుష్ప.. ఈ పాన్ ఇండియా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం అంతే వేగంగా ముందుకు వెళ్తున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది.
అంతే కాదు పుష్ప డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం మరో విశేషం. పుష్ప మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17వ తేదీన విడుదల చేస్తున్నారు. పుష్ప నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, తొలి సింగిల్ అన్ని సూపర్ గా ఆకట్టుకున్నాయి. తాజాగా పుష్ప సినిమా నుంచి హీరోయిన్ రష్మిక మందన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా, అచ్చమైన పల్లెటూరి అమ్మాయి శ్రీవల్లిగా రష్మిగా అందరిని ఆకట్టుకుంది.
పుష్ప సినిమా నుంచి శ్రీవల్లిపై రూపొందించిన సెకండ్ సింగిల్‌ను ఈ నెల 13వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘పుష్ప రాజ్ మనస్సు దోచుకుంది.. ఇప్పుడు మన ఊపిరి ఆపేసేందుకు వస్తోంది శ్రీవల్లి.. అంటూ పుష్ప టీమ్ ట్వీట్ చేసింది. పుష్ప తన మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో సినిమా విడుదల తేదీని ప్రకటించిన వెంటనే ఎంతో భయం వేసిందని హీరోయిన్ రష్మిక మందన చెప్పింది. ఈ సినిమా విజయం ఎలా ఉంటుందో అని ఆందోళనగా ఉందని ఆమె పేర్కొంది.
ఈ సినిమాలో తన రోల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చింది. పుష్పలో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని, తన కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిల అవుతుందని చెప్పింది. పుష్ప నుంచి వచ్చే శ్రీవల్లి పాట కోసం అందరిలాగే తాను కూడా ఎదురుచూస్తున్నానని రష్మిక మందన అంది. ఇక అల్లు అర్జున్ అభిమానులైతే పుష్ప సినిమా కోసం వేయి కళ్లతో ఎదరుచూస్తున్నారు.
The second single of #PushpaTheRise, #Srivalli is sung by @javedali4u 🎶
Get mesmerized with his magical voice from 13th OCT at 11:07 am ❤️#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @adityamovies @MythriOfficial pic.twitter.com/IDZXLyy0rp
— Pushpa (@PushpaMovie) October 9, 2021