ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. ఓ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. పుష్ప పూర్తి స్థాయి స్మగ్లర్ గా మారడానికి బాటలు వేసే సీన్ ఇది. ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేయాలని భావిస్తాడు హీరో. కానీ ఆ ప్రాంత పోలీసు అధికారి చాలా స్ట్రిక్ట్.
అతడి కళ్లు కప్పి చందనం దుంగల్ని స్మగుల్ చేయడం దాదాపు అసాధ్యం. ఈ సమయంలోనే పుష్ప తన తెలివితేటలతో.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. పాల ట్యాంకర్ లో ఎర్ర చందనం దుంగల్ని స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ట్యాంకర్ పై భాగంలో పాలు.. దాని కింద పోర్షన్ లో ఎర్ర చందనం దుంగల్ని దాచి.. పోలీసులకు ఏమాత్రం డౌట్ రాకుండా.. ఎంతో చాకచక్యంగా వాటిని రవాణా చేస్తాడు. సినిమాకే హైలెట్ గా నిలిచిన ఈ సీన్.. నాలుగేళ్ల క్రితమే వాస్తవంగా జరిగింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : పుష్పలో అల్లు అర్జున్ ను నగ్నంగా చూపిద్దామనుకున్న సుకుమార్
సుకుమార్ కే ఆదర్శంగా నిలిచారు ఈ ఎర్ర చందనం స్మగ్లర్ లు. 2 కోట్ల రూపాయల విలువ చేసే.. 95 ఎర్ర చందనం దుంగల్ని.. ఆయిల్ ట్యాంకర్ లో దాచి.. స్మగ్లింగ్ చేయాలని భావించారు దుండగులు. వీరి చర్యలపై అనుమానం వచ్చిన కడప పోలీసులు.. ట్యాంకర్ ని ఆపి పరిశీలించగా.. లోపల చక్కగా అమర్చిన ఎర్ర చందనం దుంగలు దర్శనమిచ్చాయి. వీరి తెలివికి అవాక్కయిన పోలీసులు.. తమిళనాడుకు చెందిన ఈ నిందితుల్ని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి : Pushpa Copy: పుష్ప కథ కాపీనా? ఆధారాలు బయటపెట్టిన జర్నలిస్ట్!
అప్పట్లో ఈ వీడియో తెగ వైరలయ్యింది. నాలుగేళ్ళ క్రితం జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు పుష్ప సినిమా పుణ్యమా అంటూ మళ్ళీ హైలెట్ అవుతోంది. ఇప్పుడు ఈ వీడియోని చూసిన నెటిజన్స్.. పుష్ప స్మగ్లింగ్ సీన్స్ అంతా ఇక్కడ నుండే కాపీ కొట్టారని వీడియో కింద కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి.. కూడా ఈ వీడియోని చూసి, కింద కామెంట్స్ పై ఓ లుక్ వేసేయండి.