సోషల్ మీడియా ప్రేమలు హద్దులు దాటి.. సరిహద్దులు దాటిపోయాయి. ఇటీవల కాలంలో ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్‌లో మొదలైన ప్రేమ కథలు అవరోధాలను చేధించుకుని.. సుఖాంతమయ్యాయి. ఖండాంతరాలు ఆవల ఉన్న ప్రియుడి కోసం మహిళలే రావడం గమనార్హం.
సోషల్ మీడియా ప్రేమలు హద్దులు దాటి.. సరిహద్దులు దాటిపోయాయి. ఇటీవల కాలంలో ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్‌లో మొదలైన ప్రేమ కథలు అవరోధాలను చేధించుకుని.. సుఖాంతమయ్యాయి. ఖండాంతరాలు ఆవల ఉన్న ప్రియుడి కోసం మహిళలే రావడం గమనార్హం. సీమా హైదర్, జూలీ, పోలాక్ బార్చరా, అంజూ, విఘ్నేశ్వరి వీరంతా ఆ జాబితాలోకి వస్తారు. సీమా, జూలీ, అంజూ వీరంతా.. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన లవర్స్ కోసం భర్తలను సైతం విడిచి పెట్టి వెళ్లిపోవడం విడ్డూరం. వీరందరికీ ఆద్యం పోసిన కథ సీమా హైదర్ది. పాకిస్తాన్ మహిళ అయిన సీమా హైదర్.. పబ్జీలో పరిచమైన ఉత్తరప్రదేశ్ యువకుడు సచిన్ కోసం.. భర్తను వదిలేసి..తన నలుగురు పిల్లలతో కలిసి దొంగచాటుగా భారత్‌లోకి ప్రవేశించిన సంగతి విదితమే.
యుపి చేరుకున్నాక పెళ్లి చేసుకున్నారు సీమా-సచిన్. ఈ విషయం ఆ నోట ఈ నోట పొక్కి పోలీసుల చెంతకు చేరింది. పాక్ మహిళ దేశంలోకి రావడంతో ఆమె గూఢఛర్యం నడుపుతున్న ఆరోపణలపై సీమాను పోలీసులు పలుమార్లు విచారించారు. అక్రమంగా దేశంలో చొరబడిన సీమాకు ఆశ్రయం కల్పించిన సచిన్, అతడి తండ్రిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఆపై బెయిల్ పై బయటికి వచ్చారు. అయితే భర్త ఆమెను తిరిగి పంపాలని ఏడుస్తుంటే.. సచినే తన భర్త అని, ఇక్కడి నుండి వదిలి వెళ్లేది లేదని తెగేసి చెబుతోంది సీమా. మొన్నటికి మొన్న యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. ఆమె పాక్ ఐఎఎస్ ఏజెంట్ అని తేలితే.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అయితే ఇప్పుడు ఈ సీమా హైదర్ గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. త్వరలో ఆమె సినిమాలో నటించబోతుందట. ఎ టైలర్ మర్డర్ స్టోరీ చిత్రం కోసం ఆమె అడిషన్ లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్తాన్ ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కున్నట్లు తెలుస్తోంది. రా క్యారెక్టర్‌కు ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాకుండా రాజకీయాల్లోకి కూడా ఆమెను తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2024లో యుపిలోని ఓ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశాలున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. చూడాలి సినీ రంగమా, లేక రాజకీయాన్ని ఆమె ఎంచుకుంటుందో..? లేక రెండింట్లో కాలు పెడుతుందో.? మీరెమంటారో అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.