స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 350 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 380 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,250.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,370.
1కిలో వెండి 67, 210
బిజినెస్ డెస్క్- ఈ రోజు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 35 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 38 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 350 రూపాయలు పెరిగి 45 వేల 250 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 380 రూపాయలు పెరిగి 49 వేల 370 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధర కిలో కేవలం 10 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 67 వేల 210 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 350 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 390 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 620 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,770 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,080 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48,080 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,060 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,340 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.