ఆసియాలో ఉత్తమ జంతుప్రదర్శనశాలల్లో బాగా నిర్వహించబడే, నెహ్రూ జూలాజికల్ పార్కులో 1,500 కంటే ఎక్కువ రకాల పక్షులు, జంతువులు, సరీసృపాలు ఉన్నాయి. ఈ జంతుప్రదర్శనశాలలో మైనస్, తెల్ల నెమళ్ళు, ఆఫ్రికన్ ఏనుగులు, చింపాంజీలు మరియు ఖడ్గమృగాలు వంటి వివిధ జాతులు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల వేడుకలు, మొహర్రం ఊరేగింపుల్లో రాణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. ఆసియాలో ఎక్కువ కాలం జీవించిన ఏనుగుల్లో రాణి మూడోది. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు దగ్గరున్న 88 ఏళ్ల చెంగళ్లూర్ దాక్షాయణి అనే ఆడ ఏనుగు ఎక్కువ కాలం జీవించగా, లిన్ వ్యంగ అనే 86 ఏళ్ల మగ ఏనుగు దాని తర్వాత స్థానంలో నిలిచింది.
ఇప్పుడు రాణి చనిపోవడంతో హైదరాబాద్ జూలో నాలుగు ఆసియా ఏనుగులే మిగిలాయి. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాణి వృద్ధాప్యం కారణంగా వచ్చిన సమస్యలతో మరణించినట్లు జూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ జూలో ఉన్న అన్ని జంతువులకంటే రాణి వయసులో పెద్దది. ఇది 1938 అక్టోబర్ 7న పుట్టింది. 1963లో ఈ ఏనుగును నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుంచి నెహ్రూ జూ కి తీసుకువచ్చారు. రీసెంట్ గా హైదరాబాద్ జూలో 21 ఏళ్ల చిరుతపులి కూడా చనిపోయింది. దీనిని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శన శాల నుంచి 2000 సంవత్సరంలో హైదరాబాద్ జూకు తీసుకువచ్చారు.