బుల్లితెర యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసభ్యతకు తావు లేకుండా.. సమయానుకూలంగా పంచ్ లు వేయడంలో ప్రదీప్ కు ఎవరూ సాటి లేరంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఏ షోలైనైనా ప్రదీప్ తన పంచ్ లతో గెస్ట్ లకు చుక్కలు చూపిస్తాడు. కానీ మొదటి సారి ప్రదీప్ ను ఇబ్బంది పెట్టారు కొణిదెల వారమ్మాయి నిహారిక. ప్రదీప్ గురించి ఎవరికి తెలియని విషయాలను స్టేజ్ మీద వెల్లడించి.. ప్రదీప్ పరువు తీశారు. ఆ వివరాలు..
2021కి గుడ్ బై చెప్పి.. న్యూ ఈయర్ 2022 కి ఆహ్వానం పలుకుతూ.. జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. దావత్ పేరుతో డిసెంబర్ 26 ఆదివారం ప్రసారం కాబోయే ఈ షోలో నాగబాబు, ఆయన భార్య, వారి కుమార్తె నిహారిక, ఆలీ, ఆయన భార్య, బ్రహ్మానందం,యాంకర్ సుమ, హీరో విశ్వక్ సేన్ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది.
ఇది కూడా చదవండి : ప్రదీప్ పెళ్లిపై సునీత సంచలన వ్యాఖ్యలు..!
ఈ క్రమంలో షోకి గెస్ట్ గా వచ్చిన నిహారికను రిసీవ్ చేసుకుంటాడు ప్రదీప్. ఆ తర్వాత దావత్ ఇవ్వాలని కోరతాడు. ఎందుకు అని నిహారిక ప్రశ్నించగా.. వివాహం అయి వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా దావత్ కావాలంటాడు ప్రదీప్. అప్పుడు నిహారిక ప్రదీప్ గురించి మనం తెలుసుకోవాలని విషయాలు చాలా ఉన్నాయని చెప్పి.. అతడి స్నేహితులను స్టేజ్ మీదకు ఆహ్వానిస్తుంది.
ఇది కూడా చదవండి : బాబాయ్ పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ తర్వాత ప్రదీప్ స్కూల్ డేస్ లో చేసిన అల్లరిని వివరిస్తుంది నిహారిక. ఈ క్రమంలో ఆలీ.. ప్రదీప్ స్నేహితురాలిని మీ పెళ్లి ఎప్పుడు అయ్యిందని అడుగుతాడు. అందుకు ఆమె 2022, జనవరికి 15 సంవత్సరాలు పూర్తవుతాయి అని చెబుతుంది. దాంతో ప్రదీప్ ఏజ్ గురించి ఇండైరెక్ట్ గా బయటకు వచ్చినట్లయింది. ఆ వెంటనే సుమ లేచి.. అడగాల్సిన ప్రశ్న అడిగారు అంటూ ఆలీని ప్రశంసిస్తుంది. అలా మొత్తానికి నిహారిక స్టేజీ మీద ప్రదీప్ పరువు తీశారు.