మెగా డాటర్ నిహారిక మళ్లీ నటన మీద ఫోకస్ పెడుతున్నారు. భారీ గ్యాప్ తర్వాత ఆమె ప్రేక్షకులను పలకరించనున్నారు. నిహారిక నటించిన ఒక వెబ్ సిరీస్ త్వరలో ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోయినా.. లేదా తెరపై కనిపించకపోయినా వారి నుండి ఎప్పుడెప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తాయా అని ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. కాస్త లేటుగా అయినా వారి నుండి కొత్త అప్ డేట్ వస్తే చాలు.. సెలబ్రిటీలు యాక్టీవ్ గానే ఉన్నారని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటారు. కొంతకాలంగా ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక పేరు పెద్దగా వినిపించడం లేదు. ఎట్టకేలకు ఉగాది నూతన సంవత్సరాది సందర్భంగా నిహారిక నుండి కొత్త అప్ డేట్ వచ్చేసింది.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల చైల్డ్ హుడ్ పిక్స్ ని బాగా వైరల్ చేస్తున్నారు. సీనియర్ స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకూ హీరోహీరోయిన్స్ కి సంబంధించి చిన్ననాటి ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రేక్షకులకైనా, అభిమానులకైనా సెలబ్రిటీల గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆరాటం, ఆసక్తి ఉంటాయి. కానీ.. సెలబ్రిటీల విషయాలు కదా! వాళ్ళు చెబితేనే బాగుంటుందని వెయిట్ చేస్తుంటారు. సరే.. చర్చించుకోవాల్సిన విషయాలంటే వాళ్లే చెబుతారు.. మరి గుర్తుంచుకోవాల్సిన విషయాల సంగతేంటీ? అంటారా.. గుర్తుంచుకోవాల్సినవి […]
బాల్యం ఓ మధుర జ్ఞాపకం. ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు లేకుండా చాలా హాయిగా గడిచిపోయింటుంది. పసితనంలో ప్రతి ఒక్కరికీ ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చిన ప్రతిసారీ కూడా ఏదో ఓ తెలియని అద్భుతమైన అనుభూతి మనకు అనిపిస్తుంది. చిన్ననాటి ఫొటోలు మనవి మనం చూసుకుంటే ఆ జ్ఞాపకాల్లో విహరిస్తాం. మనవి మాత్రమే కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్ కు ఉన్న చాలామంది సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ […]
మెగా కాంపౌండ్‌నుంచి హీరోయిన్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ మెగా గాళ్.. నిహారిక. యాంకర్‌గా తన ప్రస్ధానాన్ని మొదలుపెట్టారు నిహారిక. బుల్లి తెరపై యాంకర్‌గా పలు షోలు చేశారు. యాంకర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత హీరోయిన్గా కూడా మారారు. నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘ఒక మనసు’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఓ వైపు నటిస్తూనే మరోవైపు యాంకరింగ్ చేశారు. అంతేకాదు! ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి […]
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీలో చురుగ్గా, చలాకీగా ఉంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు. అప్పుడప్పుడు టీవీ షోస్ లో కూడా సందడి చేస్తూ వినోదాన్ని పంచుతుంటారు. తాజాగా ఓ కుకింగ్ షోలో నిహారిక పాల్గొన్నారు. ఆహాలో చెఫ్ మంత్ర సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. మంచు లక్ష్మీ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ముఖ్య అతిథులుగా మెగా డాటర్ నిహారిక, ఎం.ఎం. కీరవాణి కుమారుడు […]
దీపావళి పండుగ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి.. అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసి.. పార్టీ నిర్వహించారు. ఆదివారం రాత్రి అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన ఈ పార్టీకి మెగా ఫ్యామిలీ నుంచి పలువురు హాజరయ్యారు. చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత, నాగబాబు కుమార్తె నిహారిక, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు పార్టీకి అటెండ్ అయ్యి సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు […]
తెలుగు ఇండస్ట్రీలో మెగా, అల్లు ఫ్యామిలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు కుటుంబాల నుంచి.. కేవలం టాలీవుడ్, సౌత్‌లోనే కాక.. పాన్ ఇండియా రేంజ్ స్టార్ హీరోలున్నారు. సినిమాల పరంగా ఎలా ఉన్నా.. ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి.. అల్లు వారింటి అల్లుడు. రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలుంటాయి. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో రెండు కుటుంబాలు ఒక్క చోట చేరి.. సందడి చేస్తాయి. తాజాగా […]
మెగాడాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీలో ‘ఢీ’ షో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. అక్కడ సక్సెస్ అయింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తో బాగా ఫేమస్ అయింది. ఇక సినిమాల్లో హీరోయిన్ గా అడుగుపెట్టి లక్ పరీక్షించుకుంది. కానీ అనుకున్నంతంగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ప్రస్తుతం నటిగా కంటే నిర్మాతగా చాలా బిజీగా మారిపోయింది. ఓవైపు సినిమాలు, సిరీసులు అంటూ బిజీగా ఉన్నప్పటికీ.. విదేశాలకు టూర్స్ వేస్తూ […]
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. 2014లో పార్టీ పెట్టినప్పటికీ యాక్టివ్ పాలిటీషియన్ అనిపించుకోలేదు. 2014లో అయితే అసలు పోటీకూడా చేయకుండా టీడీపీకి మద్దతు పలికారు. కానీ, 2019 ఎన్నికల్లో మాత్రం పోటీ చేసినప్పటికీ కేవలం ఒక్క సీటును మాత్రమే సొంతం చేసుకోగలిగారు. ఇప్పుడు మాత్రం 2024లో అధికారం దక్కించుకోవడమే తమ లక్ష్యం అంటూ ముందుకెళ్తున్నారు. అటు పవన్ కల్యాణ్ సైతం పాలిటిక్స్ లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల విశాఖ పర్యటన […]