ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల చైల్డ్ హుడ్ పిక్స్ ని బాగా వైరల్ చేస్తున్నారు. సీనియర్ స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకూ హీరోహీరోయిన్స్ కి సంబంధించి చిన్ననాటి ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రేక్షకులకైనా, అభిమానులకైనా సెలబ్రిటీల గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆరాటం, ఆసక్తి ఉంటాయి. కానీ.. సెలబ్రిటీల విషయాలు కదా! వాళ్ళు చెబితేనే బాగుంటుందని వెయిట్ చేస్తుంటారు. సరే.. చర్చించుకోవాల్సిన విషయాలంటే వాళ్లే చెబుతారు.. మరి గుర్తుంచుకోవాల్సిన విషయాల సంగతేంటీ? అంటారా.. గుర్తుంచుకోవాల్సినవి అంటే జ్ఞాపకాలే కదా.. అవి కూడా వాళ్లే షేర్ చేస్తారు లేదా గూగుల్ లో వెతుక్కోవడమే!
అవును.. సెలబ్రిటీలకు సంబంధించి మంచి చెడు విషయాలన్నీ గూగుల్ లోనే వెతుకుతున్నారు. మంచి మెమొరీస్ అయినా.. కాంట్రవర్సీ మ్యాటర్స్ అయినా అంతే. అయితే.. ట్రెండ్ మారుతున్న సంగతి తెలిసిందే. హీరోలైనా, హీరోయిన్స్ అయినా అన్నింటికి సోషల్ మీడియా ఉందిగా అంటున్నారు. ఏంటి.. కాదంటారా! ఈ ఫోటో చూస్తే మీరే అవును అంటారు. చూశారు కదా! ఈ త్రోబాక్ పిక్ లో ఇద్దరు టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో ముద్దుగా ఉన్నారు. పైగా వారిద్దరికీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఇంకా గుర్తుపట్టలేదా!
వారిద్దరిని చూస్తుంటే.. మెగా ఫ్యామిలీకి చెందినవారిలా లేరూ! లేరూ ఏంటి వారే!
ఎవరా వారు.. అనంటే బావమరదళ్ళు. అవును.. ఒకరు హీరో అయితే ఇంకొకరు హీరోయిన్ గా సినిమాలు చేసి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారారు. ఓహో.. అంటే వీరిద్దరూ పంజా వైష్ణవ్ తేజ్, నిహారికలే కదా! ఎస్.. వారే వీరు. గట్టిగా గమనిస్తే.. రెడ్ షర్ట్ లో వైష్ణవ్ ని గుర్తించడం ఈజీనేమో, కానీ.. నిహారికను చూస్తుంటే గుర్తుపట్టడం కష్టమే అనిపిస్తోంది కదా. రీసెంట్ గా నిహారిక బర్త్ డే సందర్భంగా వైష్ణవ్ తేజ్.. ఈ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఎంతో ముద్దుగా ఉన్న ఈ ఫోటో పోస్ట్ చేసినప్పుడు వైరల్ అయ్యిందో లేదో గానీ.. ఇప్పుడైతే నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి ఈ మెగా చైల్డ్ హుడ్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలుపగలరు.