మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ లావణ్య త్రిపాఠి ఇటీవలే ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా అంటే చాలా సీక్రెట్‌గా ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన ఈ క్యూట్ కపుల్ ఎట్టకేలకు పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ లావణ్య త్రిపాఠి ఇటీవలే ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా అంటే చాలా సీక్రెట్‌గా ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన ఈ క్యూట్ కపుల్ ఎట్టకేలకు పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. మధ్యలో తమ రిలేషన్ గురించి ఎన్ని వార్తలు వచ్చినా కానీ అస్సలు రెస్పాండ్ కాకుండా సైలెంట్‌గా ఉండి, ఒకేసారి ఎంగేజ్మెంట్తో షాక్ ఇచ్చారు. ఈమధ్యనే వరుణ్-లావణ్య డేట్‌కి వెళ్లారు. ఇటలీలోని బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని విజిట్ చేస్తూ సరదాగా చిల్ అయ్యారీ లవ్ బర్డ్స్. అక్కడ కాఫీ డేట్‌కి వెళ్లిన పిక్స్‌ని తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు.
ఇక రీసెంట్గా వదిన లావణ్యతో కలిసి మరదలు నిహారిక కొణిదెల పార్టీ ఎంజాయ్ చేసింది. వదినా మరదళ్లిద్దరూ పార్టీలో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆడబిడ్డ నిహారికకు వదిన లావణ్యతో ఇంతకుముందు నుంచే ఫ్రెండ్షిప్ ఉందట. ఇక త్వరలో తమ ఇంటికి కోడలిగా రాబోతుండడంతో ఆ బంధం మరింత బలపడింది. దీంతో కలిసి పార్టీలకు తెగ తిరిగేస్తున్నారు.
రీసెంట్ పార్టీలో సరదాగా సెల్ఫీలు తీసుకున్నారు. వాటిని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ.. ‘లవ్లీ వెదర్లో ఫేవరెట్ పీపుల్‌తో మంచి సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నాను’ అంటూ కామెంట్ చేసింది. ఇక నిహారిక ‘లవ్ యూ లవ్స్’ అంటూ కాబోయే వదినతో సెల్ఫీస్ షేర్ చేసింది. ప్రస్తుతం మెగా వదినా-మరదలి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘మిస్టర్’ మూవీలో వరుణ్-లావణ్య ఫస్ట్ టైం కలిసి యాక్ట్ చేశారు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా వీళ్ల పర్సనల్ లైఫ్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.