మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీలో చురుగ్గా, చలాకీగా ఉంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు. అప్పుడప్పుడు టీవీ షోస్ లో కూడా సందడి చేస్తూ వినోదాన్ని పంచుతుంటారు. తాజాగా ఓ కుకింగ్ షోలో నిహారిక పాల్గొన్నారు. ఆహాలో చెఫ్ మంత్ర సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. మంచు లక్ష్మీ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ముఖ్య అతిథులుగా మెగా డాటర్ నిహారిక, ఎం.ఎం. కీరవాణి కుమారుడు కాలభైరవ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ వీరి జీవితాల్లో జరిగిన కీలక ఘట్టాలను రాబట్టారు. అందులో ఒకటి ఈమె గతంలో నటించిన షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన ఘట్టం. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కాలేదు. దాన్ని కళాఖండం అంటారులెండి అంటూ మెగా డాటర్ కామెంట్స్ చేశారు.
నిహారికని అందరూ నిహారిక అని, నిహా అని పిలిస్తే.. కాలభైరవ మాత్రం తనని ఆశ అని పిలుస్తారట. అలా పిలవడానికి కారణం ఒక షార్ట్ ఫిల్మ్ అని ఆమె వెల్లడించారు. ఆ షార్ట్ ఫిల్మ్ లో నిహారిక చేసిన పాత్ర పేరు ఆశ అని, అందుకే నిహారికను ఆ పేరు పెట్టి పిలుస్తా అని కాలభైరవ అన్నారు. ఆ షార్ట్ ఫిల్మ్ మాకు మాత్రమే తెలుసని, ఎవరికీ తెలియదని అన్నారు. ఆ షార్ట్ ఫిల్మ్ లో హీరోగా అఖిల్ నటించగా, హీరోయిన్ గా నిహారిక నటించారట. ఈ లఘు చిత్రానికి రాజమౌళి కుమారుడు కార్తికేయ దర్శకత్వం వహించారట. కానీ ఎందుకు రిలీజ్ కాలేదో అఖిల్, కార్తికేయలని అడగండి అని నిహారిక అన్నారు. అంతేకాదు అదొక కళాఖండం అని కూడా పేర్కొన్నారు. ఆ షార్ట్ ఫిల్మ్ ని ఇప్పుడు రిలీజ్ చేస్తే డబ్బులు వస్తాయ్ కదా అని మంచు లక్ష్మీ అనగా.. డబ్బులు కంటే పరువు ముఖ్యం అని సరదాగా వ్యాఖ్యానించారు.