సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోయినా.. లేదా తెరపై కనిపించకపోయినా వారి నుండి ఎప్పుడెప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తాయా అని ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. కాస్త లేటుగా అయినా వారి నుండి కొత్త అప్ డేట్ వస్తే చాలు.. సెలబ్రిటీలు యాక్టీవ్ గానే ఉన్నారని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటారు. కొంతకాలంగా ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక పేరు పెద్దగా వినిపించడం లేదు. ఎట్టకేలకు ఉగాది నూతన సంవత్సరాది సందర్భంగా నిహారిక నుండి కొత్త అప్ డేట్ వచ్చేసింది.
సాధారణంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోయినా.. లేదా తెరపై కనిపించకపోయినా వారి నుండి ఎప్పుడెప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తాయా అని ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. కాస్త లేటుగా అయినా వారి నుండి కొత్త అప్ డేట్ వస్తే చాలు.. సెలబ్రిటీలు యాక్టీవ్ గానే ఉన్నారని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటారు. కొంతకాలంగా ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక పేరు పెద్దగా వినిపించడం లేదు. పైగా ఆమె కూడా అటు సోషల్ మీడియాలో.. ఇటు కెమెరా ముందు యాక్టీవ్ గా ఉండట్లేదు. సో.. నిహారిక ఏం చేస్తోంది? ఎలాగో పెళ్లయ్యాక నటన ఆపేసింది కదా.. ప్రొడ్యూసర్ గాను మధ్యలో ఓటిటి సినిమాలు చేసింది. ఏ అప్ డేట్ లేదేంటి? అని సందేహాలు తలెత్తాయి.
ఎట్టకేలకు ఉగాది నూతన సంవత్సరాది సందర్భంగా మెగా డాటర్ నిహారిక నుండి కొత్త అప్ డేట్ వచ్చేసింది. తాను ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నానని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ ద్వారా వెల్లడించింది. నటిగా చాలా తక్కువ సినిమాలు చేసిన నిహారిక.. సైరా నరసింహారెడ్డిలో చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి.. మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్(వెబ్ సిరీస్) ప్రాజెక్ట్ లను నిర్మించింది. ఈసారి గ్యాప్ తీసుకొని.. ప్రొడక్షన్ తో పాటు నటిగా కూడా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిహారిక పెట్టిన పోస్ట్ లో.. ‘డెడ్ పిక్సెల్’ అనే ప్రాజెక్ట్ తో హాట్ స్టార్ లో అలరించనున్నట్లు సమాచారం. అయితే.. ఇందులో నిహారిక కూడా నటించనుందని టాక్ నడుస్తోంది. కాగా.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయనున్నట్లు ఆమె పేర్కొంది. మరి నటిగా, ప్రొడ్యూసర్ గా నిహారిక గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.