దీపావళి పండుగ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి.. అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసి.. పార్టీ నిర్వహించారు. ఆదివారం రాత్రి అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన ఈ పార్టీకి మెగా ఫ్యామిలీ నుంచి పలువురు హాజరయ్యారు. చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత, నాగబాబు కుమార్తె నిహారిక, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు పార్టీకి అటెండ్ అయ్యి సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. పార్టీకి నటి, ప్రముఖ డాన్సర్ సంధ్యారాజు కూడా హాజరయ్యింది. స్నేహారెడ్డి.. అల్ట్రామోడ్రన్ దుస్తుల్లో మెరిసిపోయింది.
ఇక పార్టీ సందర్భంగా మెగా డాటర్ నిహారిక, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి డాన్స్ చేయడం హైలెట్‌గా నిలిచింది. ఇక పార్టీ సందర్భంగా అల్లు సోదరులు ముగ్గురు ఒక్క చోట చేరి.. ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ పుష్ఫ 2లో నటిస్తుండగా.. అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది.