తెలుగు ఇండస్ట్రీలో మెగా, అల్లు ఫ్యామిలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు కుటుంబాల నుంచి.. కేవలం టాలీవుడ్, సౌత్‌లోనే కాక.. పాన్ ఇండియా రేంజ్ స్టార్ హీరోలున్నారు. సినిమాల పరంగా ఎలా ఉన్నా.. ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి.. అల్లు వారింటి అల్లుడు. రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలుంటాయి. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో రెండు కుటుంబాలు ఒక్క చోట చేరి.. సందడి చేస్తాయి. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా మరోసారి రెండు కుటుంబాలు ఒక్చోట చేరి పండుగను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నాయి. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
దీపావళి పండుగ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి.. బంధుమిత్రుల కోసం ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వెలుగుల పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం వారి నివాసంలో.. ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో మెగా కుటుంబసభ్యులు పాల్గొని సందడి చేశారు. చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజ, మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికలతో పాటు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్‌తేజ్‌లు పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిహారిక పార్టీకి సంబంధించిన ఫోటోని.. ఫ్యామిలీ క్యాప్షన్‌తో ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
ఇక పార్టీలో నిహారిక సాయి ధరమ్‌తేజ్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇక అల్లు బ్రదర్స్ ముగ్గురు ఒకేచోట చేరిన ఫోటో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక పార్టీలో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి.. ఇద్దరు స్టైలీష్ దుస్తుల్లో మెరిసిపోయారు. పార్టీకి నటి, ప్రముఖ డ్యాన్సర్ సంధ్యారాజు కూడా హాజరయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.