లైకుల కోసం సోషల్ మీడియాలో ఏకంగా ఫస్ట్ నైట్ వీడియోని షేర్ చేసి ఒక జంట అభాసుపాలు అయ్యింది. పెళ్లైన తర్వాత తొలి రాత్రి వీడియో అప్ లోడ్ చేసి ఇంటర్నెట్ సెన్సేషన్ క్రియేట్ చేశారు రాహుల్, ఆరుషి దంపతులు. అయితే ఈ జంటపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ జంట ఏం చేసింది? ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుంటారా?
ఒకప్పుడు అంటే ఏమో గానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం జరిగినా క్షణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరైనా పొరపాటున నోరు జారితే ఆ వ్యక్తిని ట్రోల్ చేస్తూ వైరల్ చేస్తారు. సోషల్ మీడియాలోనే ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఒకప్పటిలాగా వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టే పని లేదు. డిజిటల్ మీడియా పుణ్యమా అని అందరూ సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. తప్పుని తప్పు అని నేరుగా ప్రశ్నించలేని వారు కూడా సోషల్ మీడియాలో ఖండిస్తున్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టించే పనులు చేస్తే ఊరుకోవడం లేదు. వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా మన సంస్కృతిని దెబ్బ తీసే విధంగా ప్రవర్తిస్తే క్షమించడం లేదు. వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ ఆ వీడియోని పోలీసులకు ట్యాగ్ చేస్తూ.. శిక్షలు పడేలా చేస్తున్నారు.
గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే చూసాం మనం. ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలని, ఫేమస్ అయిపోవాలని, లైకుల కోసం కక్కుర్తి పడుతూ పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టిన వాళ్ళని, బూతు వీడియోలు పెట్టే వాళ్ళని ఇలా ఎవరినీ సోషల్ మీడియా జనాలు సహించడం లేదు. రాజకీయ నాయకులని టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా దూషించిన వారిని కూడా సోషల్ మీడియా జనాలు ఊరుకోవడం లేదు. సోషల్ మీడియా టాలెంట్ ని మాత్రమే బయటపెట్టదు, ప్రవర్తన సరిగా లేకపోతే భరతం కూడా పడుతుందని అనేక సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా ఒక జంట భరతం పట్టింది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని తుత్తర కొద్దీ ఏవేవో వీడియోలు పెడుతున్నారు. అందులో కొందరు మితిమీరి మరీ ప్రవర్తిస్తూ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు.
ఒకవైపు అశ్లీలత ప్రేరేపించేలా ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటే.. మరోవైపు కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి లైకుల కోసం, పబ్లిసిటీ కోసం, ట్రెండింగ్ లో ఉండడం కోసం శృతి మించిన వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. ఈ బాటలోనే ఓ జంట సోషల్ మీడియాలో మొదటి రాత్రి వీడియోను అప్ లోడ్ చేసింది. రాహుల్, ఆరుషి అనే దంపతులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో శోభనం రాత్రి మేము ఎలా గడిపామో’ అంటూ క్యాప్షన్ పెట్టారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన కార్యాన్ని పబ్లిక్ గా చేస్తూ రెచ్చిపోయారు. ముద్దులు పెట్టుకుని.. దుస్తులు తొలగిస్తూ ఉండే ఆ వీడియోని అప్ లోడ్ చేయడమే కాకుండా.. ‘నిద్ర మత్తులో ఉన్న నా భర్త ఇలా సాయం చేశాడు’ అంటూ ఆమె తన ఖాతాలో రాసుకొచ్చింది.
ఆరుషి రాహుల్ ఖాతాలో ఆమె అప్ లోడ్ చేసింది. అయితే నెటిజన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో కామెంట్స్ టర్నాఫ్ చేసింది. అయితే ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని అస్సలు ప్రోత్సహించకూడదని.. పబ్లిక్ గా ఇలాంటి వీడియోలు పెడుతూ.. మన సంస్కృతిని నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు ఈ జంటపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ జంటపై పోలీసులు చర్యలు తీసుకుంటే మిగతా వారికి బుద్ధి వస్తుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి పోలీసులు వీరిపై చర్యలు తీసుకుంటారా? లేదా? పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ జంట వీడియోని తొలగిస్తారా? లేదా? సరదా కొద్దీ లైకుల కోసమో, మరేదో దాని కోసమో ఫస్ట్ నైట్ వీడియోని పెట్టిన జంట చేసిన పనిని మీరు తప్పుబడుతున్నారా? భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా ఉండాలంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.