మరణం..ఎప్పటికైన ప్రతీ మనిషికి రాకా మానదు అది మానవుడెరిగిన సత్యం. ఆత్మహత్య..మనిషి తన చేతులారా తనను తాను చంపుకోవటం అంటే భయంకరమైన నిర్ణయం తీసుకోవడం అన్నమాట. అలాంటి మరణాన్ని కోరుకుని ఓ యువతి ఏకంగా తన దేహాన్ని దేవునికి బలిచ్చింది. అవును.. మీరు విన్నది నిజమే. ఇలాంటి భయంకరమైన ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మానవ దేహాన్ని బలివ్వటాన్ని చరిత్ర పేజీల్లో ఎన్నో చదివాం.. మరెన్నో విన్నాం.. కానీ నేటి టెక్నాలజీ యుగంలో కూడా అలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న యువతి తనను తాను దేవునికి బలిచ్చుకుని ప్రతీ ఒక్కరికీ కన్నీళ్లను తెప్పిస్తోంది.
ఇక పూర్తి వివరాల్లో్కి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలోని ఖర్‌ఖోడా మండలంలో కుది అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో ఓ యవతి కాళీమాత అమ్మవారిని ఇష్టదైవ్యంగా కొలిచి రోజూ పూజిస్తూ ఉండేది. దీని కారణంగా ఆ యువతికి భక్తి పారవశ్యం బాగా ముదిరిపోయింది. ఆ యువతి ఇంతటితో ఆగకుండా తను కాళీమాత కుమార్తెగా భావించుకుని జనాలకు తెలిసేలా ప్రచారం చేసింది. ఇక ఒక రోజు ఊరికి దూరంగా ఉన్న ఆ కాళీమాత ఆలయానికి వెళ్లింది. ఆ ఆలయం అడవిలో గ్రామానికి దూరంగా ఉండటంతో ఆ గుడి దగ్గర ఊళ్లో వాళ్లు కానీ గుడి పూజారి కానీ ఎవ్వరూ లేరు. నిశ్శబ్దమైన వాతావరణంలో గుడి దగ్గరకు ఒంటిరిగా వెళ్లిన ఆ యువతి ఓ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది.
ఇక అసలు విషయం ఏంటంటే.? దేవునికి ముందుగా జోరుగా పూజలు చేసింది. అనంతరం తనను తాను ఆ కాళీమాతకు బలిచ్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఆ యువతి మొదటగా గొంతు కోసుకుంది. దీంతో తీవ్ర రక్త స్రావం కావటంతో ఆ రక్తాన్ని కాళీమాతకు సమర్పించుకుంది. ఇక తర్వాత అతి కష్టంగా లేచి గుడి గంటకు ఊరితాడు బిగించుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో చాలా సేపటికి గుడి పూజారి రానే వచ్చాడు. ఈ కంగు తినే దృశ్యాన్ని చూసిన ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. దీంతో ఈ సమాచారాన్ని వెంటనే ఊళ్లో పెద్దలకు చేరవేశాడు. అందరూ వచ్చి చూసే సరికి ఆ యువతి గుడి గంటకు వెళాడే దృశ్యాన్ని చూసి కంగుతిన్నారు.
దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద గాధను విన్న ప్రతీ ఒక్కరికి కన్నీళ్లు రాక మానవు. ఇక ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు తెలెత్తుతున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం ఈ ఘటనకు ముందు రోజు ఇంట్లోవాళ్లతో గొడవ పడిందని తెలియజేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇది ఖచ్చితంగా ఎవరో చేతబడి చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు. ఇది గాక ఈ మిస్టరీపై ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుండటం విశేషం.