ప్రేమ అనేది ఎంతో పవిత్రమైనది. అయితే నేటి కాలంలో కొందరు యువత ప్రేమకు ఉండే విలువను పొగొడుతున్నారు. వాట్సాప్ లో డీపీ మార్చినంత ఈజీగా తన లవర్ ను మార్చేస్తున్నారు. తాజాగా ఓ యువతి ఏకంగా ప్రియుడి కాదని తండ్రినే ప్రేమించింది. ఆ తరువాత ఆమె చేసిన పనికి అందరూ షాకయ్యారు.
ప్రేమ అనేది ఎంతో పవిత్రమైనది. అయితే నేటి కాలంలో కొందరు యువత ప్రేమకు ఉండే విలువను పొగొడుతున్నారు. వాట్సాప్ లో డీపీ మార్చినంత ఈజీగా తన లవర్ ను మార్చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. లవర్ కి హ్యాండిచ్చి.. వారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతోనే లేచిపోయిన ఘటనలు కొన్ని జరిగాయి. తాజాగా అలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ప్రియుడి తండ్రితో ఓ 20 ఏళ్ల యువతి పారిపోయింది. ‘ఎంత పని చేశావు డియర్’ అంటూ ఆ ప్రియుడు తలపట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలోని కంజూషి గ్రామంలో కమలేశ్ అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి అమిత్ అనే కుమారుడు ఉన్నాడు. అమిత్.. ఓ 20 ఏళ్ల యువతితో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. తరచూ ఫోన్ లో తన ప్రియురాలితో గంటల తరబడి మాట్లాడేవాడు. అయితే కుమారుడు ప్రవర్తనపై అనుమానం వచ్చిన కమలేశ్.. ఒక రోజు నిలదీశాడు. దీంతో అమిత్ తన ప్రేమ విషయాన్ని తండ్రికి చెప్పాడు.
అమిత్ ప్రేమకు అంగీకరించిన కమలేశ్..కాబోయే కోడలిని ఓ సారి ఇంటికి తీసుకు రమ్మని తెలిపాడు. తండ్రి మాట ప్రకారం.. తన ప్రియురాలని ఓ రోజు ఇంటికి తీసుకెళ్లాడు. అలానే ఆమెను తన కుటుంబం మొత్తానికి అమిత్ పరిచయం చేశాడు. ఆ యువతి కూడా అమిత్ ఇంట్లో సరదాగా చాలా సేపు గడిపింది. అమిత్.. తన ప్రియురాలిని తన తండ్రి కమలేశ్‌తో ఒక్కసారి మాట్లాడించాడు. అమిత్‌కు మించి తండ్రి కమలేశే ఆ యువతికి నచ్చాడు. “నీతో కలిసి జీవించాలనుకుంటున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం” అని యువతి చెప్పేసరికి కమలేశ్ అభ్యంతరం చెప్పలేదు.
ఈ క్రమంలో ఆ యువతి అమిత్ వాళ్ల తండ్రితో 2022లో మార్చిలో పారిపోయింది. అయితే ఆ యువతి తల్లిదండ్రులు చకేరి పోలీస్ స్టేషన్ల్ లో ఫిర్యాదు చేశారు. ఆ యువతి కోసం పోలీసులు నెలల తరబడి గాలించారు. చివరకు ఇటీవలే ఢిల్లీలో సహజీవనం చేస్తున్న వారిద్దరిని పోలీసులు కనిపెట్టి పట్టుకున్నారు. ప్రస్తుతం కమలేశ్ పోలీసులు అదుపులో ఉండగా.. యువతి వైద్య పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెను కూడా కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.