పోలీస్ స్టేషన్లో పోలీసుపై ఓ యువకుడు దాడికి దిగాడు. ఓ కేసులో విచారణ కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన అతడు అక్కడే విధుల్లో ఉన్న పోలీసుపై దాడి చేశాడు. ఉత్తరప్రదేశ్ మెయిన్పురిలో ఈ ఘటన జరిగింది. పాత కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆవేశానికి లోనైన సదరు వ్యక్తి సహనం కోల్పోయాడు. ఆ కోపంతోనే పోలీసుపై ముష్టి ఘాతానికి దిగాడు. కూర్చితో పోలీసుపై దాడికి దిగాడు. అక్కడే ఉన్న మిగతా పోలీసులు అప్రమత్తమై యువకుడ్ని అదుపులోకి తీసుకుని సెల్ లో వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఈ ఘటనపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. మీరు.. వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Young man loses temper, beats police official inside a police station premises in Mianpuri UP. He had been called for counselling in connection with another case.
(Note: Abusive language) pic.twitter.com/WhYJwa95NQ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 5, 2022