సోషల్ మీడియా.. దీని ప్రాభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతా రీల్స్, ఫన్నీ వీడియోలతో సెలబ్రిటీలు అయిపోవాలనే చూస్తున్నారు. కొందరు సరదాకి ఈ పనులు చేస్తుంటే.. ఇంకొందరు రీల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. చాలా మంది ఇలాంటి వీడియోల ద్వారా మంచి గుర్తింపు, అభిమానులను, ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లుగా చేస్తున్నారు. ఎవరో ఫేమస్ అయ్యారని వీళ్లు కూడా సెలబ్రిటీలు అయిపోవాలని వీడియోలు చేస్తున్నారు. అయితే మీ టాలెంట్‌ని చూపించడం తప్పేం కాదు. కానీ, ఎక్కడ చూపిస్తున్నాం? ఎలా చూపిస్తున్నాం? అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలా ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేసి ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.
ఇప్పుడు చెప్పుకోబోయేది అలాంటి ఘటనే. వాళ్లు పవిత్రమైన గుడిలో ఉంటూ బాలీవుడ్ పాటలకు హీరోయిన్స్ రేంజ్లో స్టెప్పులు వేశారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఆలయ సిబ్బంది వారిపై చర్యలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాలేశ్వర ఆలయంలో ఈ ఘటన జరిగింది. అది కూడా ఆ పని చేసింది ఎవరో భక్తులు కాదు. ఆ గుడిలో మహిళా సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్న ఇద్దరు యువతులు. ఎంతో పవిత్రమైన ఆలయంలో ప్యార్ ప్యార్ కర్తే కర్తే అంటూ చిందులు వేశారు. అది వాళ్లు పోస్ట్ చేశారో? లేక ఎవరైనా కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో తెలియదు. వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఆ మహిళా సెక్యూరిటీ సిబ్బంది చేసిన వీడియో అధికారుల కంట పడింది. వెంటనే వారిపై చర్యలకు ఉపక్రమించారు. తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ రాష్ట్రంలో ఆలయంలో డాన్సులు చేయడం, అధికారులు చర్యలు తీసుకోవడం కొత్తేం కాదు. గతంలో ఛత్తర్పూర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆలయం మెట్లపై చిరిగిన జీన్స్ వేసుకుని ఓ యువతి బాలీవుడ్ పాటలకు స్టెప్పులేసింది. ఆ వీడియో కూడా వైరల్ కావడంతో ఆ యువతిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్ర హోమంత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించారు. ఆమె ఆ వీడియో డిలీట్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆ కేసు ఇంకా పరిష్కారం కాలేదు. ఇలాంటి వీడియోలు చూసిన నెటిజన్లు.. ఎక్కడ ఉన్నాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది అంటూ వారికి హితవు పలుకుతున్నారు.
महाकाल मंदिर में फिल्मी गाने पर दो महिला सुरक्षाकर्मियों के डांस करने का वीडियो सामने आया है. #JanhitTimes #ujjainmahakaltemple #Temple #viralvideo #madhyapradesh pic.twitter.com/HwVELfJ2x7
— Janhit Times (@janhit_times) December 5, 2022