భారతీయులు ఎంతో పవిత్రంగా దర్శించుకునే ఆలయాల్లో ఒకటి కేదార్‌నాథ్ మందిర్. పరమశివుడు కొలువై ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి భక్తులు ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తుంది. అయినా కూడా శివుడి దర్శనం కోసం ప్రతి సంవత్సరం వెళ్తుంటారు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా కాంట్రవర్సీకి సంబంధించిన వీడియోలు అయితే క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ దేవాలయంలోని గర్భగుడిలో అపచారం చోటు చేసుకుంది. ఓ మహిళా భక్తురాలు శివలింగపై నోట్లు చల్లుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. దీంతో శివ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
కేదార్‌నాథ్ మందిర్ హిందూ దేవాలయం. ఉత్తరాఖండ్.. మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణి లో ఉంది ఈ పుణ్యక్షేత్రం. ఇక్కడ వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్, నవంబర్ మాసంలో మాత్రమే ప్రజలకు ఆలయాన్ని తెరచి ఉంచుతారు. శీతాకాలంలో కేదార్ నాత్ ఆలయం నుంచి దేవతా విగ్రహాన్ని కిందకు తీసుకువచ్చి ఆరు నెలల వరకు పూజలు నిర్వహిస్తారు. కేదార్‌నాథ్‌ను శివుని నిలయంగా భక్తులు పూజిస్తుంటారు. అలాంటి పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో ఓ మహిళ అపచారానికి పాల్పడింది. అంతేకాదు శివుని శివలింగంపై కరెన్సీ నోట్లను వర్షంలా కురిపించింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ తెల్ల చీర, మెడలో రుద్రాక్షలు ధరించి కేదార్‌నాథ్ గర్భగుడిలోని శివలింగపై నోట్లు చల్లుతూ తన్మయత్వంలో మునిగిపోయి నృత్యం చేస్తూ కనిపించింది. మరోవైపు ఆమె పక్కన కొంతమంది భక్తులు ఈ తతంగాన్ని ఆపకుండా ప్రోత్సహించడం గమనించవొచ్చు. ఈ వీడియో చూస్తున్న హిందుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని.. పరమశివుడి ఆగ్రహానికి గురైతే అరిష్టం తప్పదని అంటున్నారు. పవిత్ర దేవాలయంలో ఇలాంటి అపచారం సహించేది లేదని అంటున్నారు. వెంటనే మహిళపై చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మహిళ వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
వాస్తవానికి కేదార్‌నాథ్ ఆలయంలోని గర్భగుడిలోకి చాలా తక్కువ మందిని అనుమతిస్తారు. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో వీడియో, ఫోటోలు తీయడం నిషేదం. కానీ ఓ మహిళ గర్భగుడిలోకి వెళ్లడమే కాదు.. శివలింగంపై కరెన్సీ నోట్లు వెదజల్లుతూ అనుచితంగా ప్రవర్తించింది. ఈ ఘటనపై శ్రీ బద్రినాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ డాక్యూమెంట్ రూపంలో అధికారికంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. స్థానిక రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే గర్భగుడిలోకి వీడియోని ఎవరు అనుమతించారు.. అధికారులు ఏం చేస్తున్నారని హిందూ సంఘాల వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Disgraceful!😡
1)A woman was seen showering money on Baba Kedarnath Shivling, in Uttarakhand!
2)How was the filming allowed, where photography & videography are strictly prohibited?@pushkardhami@KedarnathShrine@Pushpendraamu@ajeetbharti@meenakshisharan@erbmjha pic.twitter.com/r4kNosa0XA— Achhabachha🇮🇳 (@Lovepettyquotes) June 19, 2023