ఉత్తర భారతదేశంలో కన్వర్ యాత్ర ప్రారంభమైంది. దారులన్నీ భక్తులతో నిండిపోయాయి. హరిద్వార్ కన్వర్ యాత్ర జులై 15 వరకు కొనసాగుతుంది. మరిన్ని విశేషాలను తెలుసుకుందాం..
ఈ సృష్టిలో కన్నతల్లిని మించిన దైవం లేదు. తల్లి దీవెనలుంటే ఆ ఇల్లు స్వర్గంలా మారిపోతుంది. మనకు ఆది గురువు అమ్మే. అమ్మ మనకు తన రక్తాన్ని చనుపాల ధారచేసి మనల్ని కాపాడుతుంది. తను తిన్నా తినకున్నా పిల్లల కడుపు చూసేది తల్లి ప్రేమ ఒక్కటే. ఏ వయసులోనైనా అమ్మకు సాటి అమ్మే. మనం ఎంత పెద్దవారమైనా మన కోసం తపించే మనసు అమ్మదే. కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆలనాపాలనా చూసి ఉన్నంతలో సర్దుకుని తను జీవిస్తుంది. కుటుంబం కోసం ప్రతి విషయంలో రాజీ పడే రాజాగుణం అమ్మకే ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను ఏ లోటూ లేకుండా చూసుకునే పిల్లలు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఓ యువకుడు కావడిలో తన తల్లిని ఎత్తుకుని శివున్ని స్మరిస్తూ హరిద్వార్ కన్వర్ యాత్రలో కనబడ్డాడు. కొందరు వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర భారతదేశంలో కన్వర్ యాత్ర స్టార్ట్ అయి రహదారులన్నీ భక్తులతో రద్దీగా ఉన్నాయి. హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్ ల కన్వర్ యాత్ర జులై 15 వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల మంది ఈ యాత్రలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. భక్తుల మధ్య ఓ యువకుడు తన తల్లిని కావడిలో ఓ వైపు కూర్చోబెట్టుకుని.. మరో వైపు గంగాజలాన్ని మోస్తూ శివయ్యను స్మరిస్తూ వెళ్తున్న దృశ్యం అందిరిని ఆకర్షించింది. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే 62 వేల వ్యూస్ , 2,300 మంది లైక్ లు కొట్టారు. కొన్ని వందల మంది రీట్వీట్ చేశారు. నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ తెలుపుతున్నారు.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కన్వర్ యాత్ర మొదలైంది. ఇక్కడి గంగాజలాన్ని సేకరించి తమ సొంత గ్రామాల్లో శివాలయాలకు సమర్పిస్తారు. ఈ యాత్రలో అందరు కాలినడకన వెళతారు. తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేటప్పుడు బీహార్ లోని గౌముఖ్, గంగోత్రి, సుల్తాన్ గంజ్ వంటి ప్లేస్ లను సందర్శిస్తారు.