మామూలుగా పెళ్ళై, పిల్లలు ఉన్న వారు భాగస్వామికి తెలియకుండా రెండు, మూడు సెటప్ టాప్ బాక్సులు మెయింటెయిన్ చేస్తుంటారు. అయితే ఇక్కడ విచిత్రంగా ఒక మహిళ, మరొక మహిళతో సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా ఆ మహిళతో వెళ్ళిపోయింది.
ప్రేమకి ఆడ, మగ అన్న తేడా ఉండదు. ఈ మధ్య ఆడవాళ్లు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లిళ్లు కూడా చేసేసుకుంటున్నారు. అయితే పెళ్ళైన భర్తను వదిలేసి వేరే మహిళతో రిలేషన్ లో ఉండడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. భర్త ఉన్నాడు. పెళ్ళై పదేళ్లు అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త సోదరితో ప్రేమలో పడిందా మహిళ. సీన్ కట్ చేస్తే ఆమెని పెళ్లి చేసుకుంది. మరదలు అంటే సగం భర్త అని అంటారు. అంత మాత్రాన భర్తని వదిలేసి పెళ్లి చేసుకుంటారా? ఇదెక్కడైనా జరుగుతుందా? అని అనుకుంటున్నారా? ప్రేమ పుట్టాలే గానీ ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ప్రస్తుతానికైతే బీహార్ లో ఉన్నారు.
శుక్లాదేవి (32) అనే మహిళ తన భర్త ప్రమోద్ ని వదిలేసి మరదలిని వివాహం చేసుకుంది. బీహార్ లోని సమస్తిపూర్ లో ఆమె భర్త సోదరి సోని దేవిని (18) వివాహం చేసుకుంది. భర్త ప్రమోద్ ని విడిచిపెట్టి ఆయన సోదరిని వివాహం చేసుకుని ఆమెతో స్థిరపడింది. పదేళ్ల క్రితమే ప్రమోద్, శుక్లాదేవిల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్ళైన ఆరు నెలలకే మరదలితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి వేరే చోట మకాం పెట్టారు. మరదలు కోసం శుక్లా దేవి మగాడిగా మారిపోయింది. కట్టుబొట్టు పూర్తిగా మార్చేసింది. జడ కత్తిరించుకుని, మగాడిలా ప్యాంటు, షర్టు వేసుకుంటుంది.
అంతేకాదు తన పేరుని సూరజ్ కుమార్ గా కూడా మార్చుకుంది. అయితే ఈ విషయం సోనీ దేవి కుటుంబ సభ్యులకు తెలియడంతో సోనీ దేవిని బలవంతంగా తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే తన భార్యను కిడ్నాప్ చేశారంటూ సూరజ్ కుమార్ (శుక్లా దేవి) స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ సమస్యకు మీరేమైనా పరిష్కారం చూపించగలరా? ఈ విషయంలో తప్పు ఎవరిది? భర్తను కాదని భర్త సోదరిని వివాహం చేసుకున్న శుక్లా దేవిదా? లేక భర్తదా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.