ఫిబ్రవరి 14, 2019 పుల్వామా దాడి. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగింది. ఈ ఘటనతో పాక్, భారత్ ల మధ్య చిన్న యుద్ధమే జరిగింది. అనంతరం సద్దుమణిగింది. అయితే ఆ అమరుల భార్యలకు మాత్రం అన్యాయం జరిగింది.
దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో అహర్నిశలు విధులు నిర్వహిస్తూ.. అక్కడే ప్రాణాలు కోల్పోతున్న సైనికుల కుటుంబాలకు చేదు అనుభవం ఎదురౌతోంది. అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు.. వారు రోడ్డున పడేలా చేస్తున్నాయి. తమకు ఇవ్వాల్సిన వాగ్థానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలిస్తున్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న అమరుల భార్యలు.. హామీలను నెరవేర్చండీ బాబూ అంటూ ప్రభుత్వాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది నిజంగా సిగ్గు చేటు. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా దాడి. దేశం మర్చిపోలేని రోజు. జమ్ము, కాశ్మీర్‌లోని పుల్వామాలో సుమారు 40 మంది భారత జవాన్లు ఉగ్రదాడిలో అమరులైన సంగతి విదితమే. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. జవాన్లు చనిపోయారు కానీ, వారి కుటుంబాలకు మాత్రం ఇంకా సరైన న్యాయం జరగలేదు.
ఈ ఘటన జరిగి మూడేళ్లు గడిచిపోయాయి. అయితే ఇంత వరకు ఆ అమర వీరుల భార్యలకు పరిహారం అందలేదు. ఈ విషయంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కలిసి, వినతి పత్రం అందించేందుకు వెళ్లిన అమర వీరుల భార్యలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వారిని ఈడ్చుకెళ్లారు. మహిళలు అని కూడా జాలి చూపలేదు. ఇష్టాను సారంగా దాడి చేశారు. కేవలం తమకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కోరిన అమరుల భార్యలను, కొంత మంది మహిళలపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. ఈ దృశ్యాలన్నీ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ దాడిలో పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన రోహితాష్ లాంబా భార్య మంజు గాయపడ్డారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసిన తమపై దాడి చేయడం ఏంటనీ ఆమె ప్రశ్నించారు.
తమకు ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాంటూ తొలుత రాజస్థాన్ గవర్నర్ కల్రామ్ మిశ్రాకు వినతి పత్రం అందించారు. తాము ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో చావడం తప్పా తమకు వేరే దారి కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా..పోలీసులు దాడి చేశారు. పుల్వామా దాడిలో తన భర్తలు అమరులైనప్పుడు.. మమ్మల్ని పరామర్శించేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనను మెచ్చుకోవడం చూసి ఆనందించామని, తమ పిల్లల్ని కూడా ఆర్మీకి పంపాలని చూశామన్నారు.
కానీ ఇప్పుడు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. దాడి చేస్తుండటంతో తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు జవాన్ల భార్యలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, తమ భర్తల పేరుపై స్మారకాలు నిర్మిస్తామని చెప్పి ఈ రోజు వరకూ ప్రభుత్వం పట్టించుకోలేదని వీర జవాన్ల భార్యలు వాపోయారు. ప్రభుత్వం తమ గోడు వినిపించుకోవడం లేదని, బదులుగా పోలీసులతో బలప్రయోగం చేయిస్తోందని వాపోయారు. కాగా, ఈ ఘటనపై పలు విమర్శలు మొదలయ్యాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందీ కానీ.. కేంద్రంలో ఉన్న బీజెపీ కూడా వీరి పట్ల చిన్న చూపు చూస్తోంది. అమరుల కుటుంబాలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించడం లేదు. సాటి మనుషులుగా కూడా చూడటం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతోనే బీజెపీ సరిపెట్టుకుంది. బీజెపీ పాలిత రాష్ట్రాల్లోనూ వీరి పట్ల నిర్ల్యక్షమే. చివరకూ జవాన్ల కుటుంబాలకు ఏమీ ఒరగడం లేదు. ప్రజా ప్రతినిధులు, దేశ ప్రజల కోసం సైనికులు అమరులౌతుంటే.. వారి కుటుంబాలు మనిషి కోల్పోయి ఆవేదనలో మునిగిపోతున్నారు. దీనికి తోడు వారికి అందాల్సిన పరిహారాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఘటన జరిగి మూడేళ్లు గడిచినా పరిహారం కోసం చేతులు చాచి వేడుకుంటున్న దుస్థితి. జవాన్ల కుటుంబాలను ఆదుకోకుండా, వారి పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ఏ ప్రభుత్వమైనా సిగ్గు పడాల్సిన విషయం. ఇలాంటి ప్రభుత్వాలు ఉండీ ఏం లాభమన్న ప్రశ్న తలెత్తక మానదు. జవాన్ల కుటుంబాలకు అందించాల్సిన పరిహారం ఇవ్వకుండా వారిపై ప్రభుత్వాలు చేస్తు్న దాడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rajasthan: Wives of Pulwama martyrs beaten up by the police during a protest against alleged unfulfilled promises on part of the state govt@prathibhatweets shares more details on the same – Watch. pic.twitter.com/0ZjoY8Pt9Q
— TIMES NOW (@TimesNow) March 5, 2023
मुख्यमंत्री से मिलने जा रही , पुलवामा के अमर शहीद रोहिताश लांबा जी की पत्नी को कांग्रेस की राजस्थान सरकार की पुलिस ने लाठियाँ से पीटा
बिलखती इस वीरांगना के आँसू आपको सोने देंगे @ashokgehlot51 जी ? pic.twitter.com/YBxj4kfT5m
— Laxmikant bhardwaj (@lkantbhardwaj) March 4, 2023