హర్భజన్ సింగ్‌ది టీమిండియా క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం. తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో హర్భజన్‌కు రూటే సపరేటు. 1998 లో జాతీయ జట్టులోకి అరంగ్రేటం చేసిన భజ్జీ.. 2021 వరకు దాదాపు 23 ఏళ్ల పాటు క్రికెట్‌లో చరిత్రలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. ఈ క్రమంలో తాజాగా హర్భజన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. హర్భజన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన భగవంత్ మాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తులు వినిపిస్తున్నాయి. పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు రాష్ట్రం తరఫున ఓ క్రీడాకారుడిని రాజ్యసభకు పంపించాలని భగవంత్ మాన్ భావిస్తున్నారట.
అంతేకాక,.. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రాష్ట్రంలో(పంజాబ్) క్రీడలను ప్రోత్సహిస్తానని భగవంత్ మాన్ ప్రజలకు హామీ ఇచ్చారు. తమను గెలిపిస్తే క్రీడలను ప్రోత్సహించే పారదర్శక విధానాలు తీసుకొస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. అందుకే వీలైనంత త్వరగా దీన్ని అమలు చేయాలని నూతన ప్రభుత్వం భావిస్తోందట. దానిలో భాగంగానే పంజాబ్ నుంచి హర్భజన్ సింగ్‌ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇది కూడా చదవండి: సామాన్యుడి స్థాయి నుంచి సీఎం గా ఎదిగిన వ్యక్తి..పంజాబ్ కొత్త సీఎం భగవంత్ సింగ్ మాన్‌కు హర్భజన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మాన్‌కు హర్భజన్ శుభాకాంక్షలు తెలిపారు. పంజబ్‌లో క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు మరో కీలక బాధ్యతలను కూడా హర్భజన్‌కు అప్పగించాలని యోచిస్తోందట పంజాబ్ ప్రభుత్వం. త్వరలో ఏర్పాటు చేయబోయే జలంధర్ స్పోర్ట్ యూనివర్శిటీ బాధ్యతలను కూడా హర్భజన్‌కే ఇస్తారని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. పంజాబ్‌లోని 117 సీట్లలో 92 స్థానాలను గెలుచుకున్న ఆప్.. దిల్లీ తర్వాత రెండో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
#Breaking Cricketer Harbhajan Singh could be one of the five Rajya members from Punjab that AAP is set to send to the Rajya Sabha by the end of this month#HarbhajanSingh #Rajyasabha #Cricket #AAP pic.twitter.com/jdyZem709i
— Kamal Kanojiya (@KamalKanojiya19) March 16, 2022
ఇదిలా ఉండగా.. ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలిచిన తర్వాత భగవంత్ మాన్.. తన తల్లిని హత్తుకున్న ఫొటోను భజ్జీ షేర్ చేస్తూ అభినందనలు తెలిపారు. దీంతో ఆయన ఆప్ లో చేరడం ఖాయమే అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను రాజ్యసభకు పంపాలని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ విషయమై భజ్జీతో చర్చించింది. ఇందుకు ఆయన సుముఖంగా ఉండటంతో పంజాబ్ నుంచి ఆయనను ఎంపిక చేసినట్లు సమాచారం. మరి ఇవన్ని వాస్తవమో కాదో తెలియాలంటే మరికొన్ని వేచి చూడక తప్పదు.
Congratulations to @AamAadmiParty and My friend #BhagwantMann on Becoming our New Chief minister .. great to hear that he will be taking oath as the new CM in Bhagat Singh’s village Khatkarkalan, 🙏 what a picture…this is a proud moment for Mata ji 🙏🙏 pic.twitter.com/k46DNr6Pjz
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 10, 2022